

*హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తాం*
*జీహెచ్ఎంసీలో హిందుత్వంవల్లే 4 నుండి 48 సీట్లు గెలిచాం*
*ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది కదా*
*మరి ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు?*
*ఎన్నికలొస్తే… మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఝ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారు*
*12 శాతం ముస్లింలంతా ఒక్కటైతే తప్పు లేనిది 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంది?*
*హిందుత్వ వాదంతోనే గడపగడపకూ తిరుగుతా… తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం*
*సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు నయాపైసా రాదు*
*పంచాయతీల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే*
*కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు*
*బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయి*
*హుజూరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు*
*కాంగ్రెస్ 2ఏళ్ల వైఫల్యాలపై కాషాయ సమరభేరీకి శ్రీకారం*
*కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈనెల 26న ‘సంతకాల సేకరణ’*
*కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, చంద్రశేఖర్ తివారీ*
*కాషాయ సైనికుడు బండి సంజయ్ పై రూపొందించిన గీతాన్ని విడుదల చేసిన చంద్రశేఖర్ తివారీ*
*బలిరా…భళి భళిరే అంటూ సాగిన గీతానికి ఉత్సాహంతో చిందులేని బీజేపీ కార్యకర్తలు*
మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 19
ఎవరేమనుకున్నా హిందుత్వం మాట్లాడుతూనే ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుండ బద్దలు కొట్టారు. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోయిందంటే అదేరోజు నా శ్వాస ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. హిందుత్వ నినాదాన్ని గడప గడపకూ తీసుకెళ్లి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ‘‘పహల్గాంలో అవయవాలు చూసి హిందువులను కాల్చి చంపారు. హైదరాబాద్ లో ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. నిజామాబాద్ లో ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్ ను చంపారు. డీసీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. మరి అట్లాంటప్పుడు హిందుత్వం మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు అధికారంలోకి దాదాపు వచ్చేసినంత వాతావరణ ఏర్పడిందంటే దానికి కారణం హిందుత్వమే. జీహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లుంటే… 48 స్థానాలను గెలిచామంటే దానికి కారణమూ హిందుత్వమే. కరీంనగర్ లో నేను ఎంపీగా గెలిచానంటే హిందుత్వమే కారణమని గల్లా ఎగరేసుకుని చెబుతా’’అని తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలొస్తే మసీదుల్లో ఇమామ్, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఝ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు.హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు ఆ పైస్థాయి నాయకుల సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇంఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలపై రూపొందించిన ‘కరపత్రం’తోపాటు సంతకాల సేకరణ పత్రాలను విడుదల చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనా, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై ఈనెల 26న కరీంనగర్ పార్లమెంట్ పరధిలో ఇంటింటికీ వెళ్లి సంతకాల సేకరణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ఉద్వేగ భరిత ప్రసంగంలోని ముఖ్యాంశాలు…రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి చిత్తశుద్ధి లేనేలేదు. కేవలం కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఏ ఒక్క గ్రామ పంచాయతీకైనా నయాపైసా ఇచ్చిందా? ఇవ్వలేదు. అట్లాగే రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేస్తే పైసలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఎమ్మెల్యేకు కూడా సొంతంగా నిధులు లేనేలేవు. పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు ఒక్క పైసా కూడా రాదు. మరి పంచాయతీల నిధులు తెచ్చేది కేంద్రమే. 15వ సంఘం నిధులు, ఎంపీ లాడ్స్, జాతీయ ఉపాధి హామీ, సడక్ యోజన సహా గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనులన్నింటినీ కేంద్రమే నిధులిస్తోంది. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కు ఓటేసి ఏం లాభం? బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలు అభివ్రుద్ధి చెందుతాయనే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నం. కేంద్ర నిధులతోనే ఆయా రంగాల అభివ్రుద్ధి జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్ హెచ్ఎం నిధులిస్తున్నాం. ఇవి సరిపోకపోతే సీఎస్సార్ నిధులతో అవసరమైన మెడికల్ పరికరాలను కొనుగోలు చేసి అందిస్తున్నాం. హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.5 కోట్ల సీఎస్సార్ నిధులతో మెడికల్ పరికరాలను అందజేసినం. హుజూరాబాద్ లో స్టేడియం కోసం రూ.10 కోట్లు విడుదల చేయబోతున్నాం. తెలంగాణకు సీఐఆర్ఎఫ్ కింద రూ.1200 కోట్లు తీసుకొస్తే… అందులో రూ.500 కోట్లను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నం. గన్నేరువరం చిరకాల వాంఛ గన్నేరువరం బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.70 కోట్లు విడుదల చేయించినం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా లేదు. మరి ఆ పార్టీకి ఓట్లేస్తే పంచాయతీలకు ఒరిగేదేముంది? గతంలో బీఆర్ఎస్ కు ఓటేసిన పాపానికి సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది. బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే పంచాయతీలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అవసరమైతే సీఎస్సార్ నిధులు తీసుకొచ్చి పంచాయతీలకు ఖర్చు చేస్తా. ఈ విషయాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.కాంగ్రెస్ రెండేళ్ల పాలనా వైఫల్యాలు, బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలను వివరిస్తూ కరపత్రం రూపొందించాం. ఇంటింటికీ పంపాలి. అట్లాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 26 నుండి ‘సంతకాల సేకరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈనెల 26న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీ మీ పోలింగ్ బూత్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి కరపత్రం అందించి ‘సంతకాల సేకరణ’ చేయాలని కోరుతున్నా. ప్రజలందరి సంతకాలతో కూడిన పత్రాలను ప్రత్యేక రథం తయారు చేయించి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందజేస్తాం. ఆ తరువాత కూడా కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ఆందోళనలను ఉద్యమం చేస్తాం.కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’ నిర్వహించాలని నిర్ణయించడం సిగ్గు చేటు. ఏం సాధించారని తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు జరుపుకోవాల్సింది ‘‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’’ కానే కాదు…. ‘‘తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ (తెలంగాణ పతన వేడుకలు) నిర్వహించుకుంటే బాగుండేది. లేకపోతే కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ (కాంగ్రెస్ దిగజారుడు ఉత్సవాలు) నిర్వహిస్తామంటే బాగుండేది. మార్పు తెస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ‘‘అభయ హస్తం’’ పేరుతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలతో 42 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు కదా? ఎన్ని అమలు చేశారో చెప్పండి. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊదరగొట్టారు కదా? మహిళలకు ప్రతినెలా 2,500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? ఏటా రైతులకు, కౌలు రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇచ్చారా? నిరుద్యోగులకు ప్రతి నెలా 4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నారు కదా ఏమైంది? ఏడాదిలో లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదు? పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానన్నారు కదా? వ్రుద్దులకు ప్రతినెలా 4 వేల పెన్షన్, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు….చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా ఢంకా బజాయించి చెప్పారు ఏమైంది? రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించారు. చేవెళ్లలో మీటింగ్ పెట్టి ‘ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్’ ను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కామారెడ్డిలో మీటింగ్ పెట్టి బీసీలకు 6 నెలల్లోపే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ‘‘కామారెడ్డి డిక్లరేషన్’’అని ప్రకటించారు. మరి వీటిలో ఏ ఒక్క డిక్లరేషన్ అయినా అమలు చేశారా? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ సంబురపడుతున్నారు. ముస్లింల ఓట్లతో డబ్బులను నీళ్లలా ఖర్చు చేసి గెలిచారే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు. బీజేపీ కార్యకర్తలంతా కచ్చితంగా ఏదో ఒక ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధులుగా గెలవాలని కోరుతున్నా. అప్పుడే ప్రజల కష్ట నష్టాలు అర్ధమవుతాయి. కచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని కోరుతున్నా. గ్రామాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్రమోదీదే. రైతులకు రెట్టింపు గిట్టుబాటు ధరను అందిస్తామని మాట ఇచ్చి నిలుపుకున్నం. క్రమం తప్పకుండా కిసాన్ సమ్మాన్ నిధులను అందిస్తున్న ఘనత మాదే. ఇగ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నరకయాతన చూశారు. పంచాయతీలకు తీవ్రమైన నష్టం జరిగింది. సర్పంచులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరారు. సర్పంచులు అప్పులపాలు కావడానికి కారకులు బీఆర్ఎస్సే. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలే. రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలని కోరుతున్నా.హిందుత్వం మాట్లాడాలా? వద్దా?… బరాబర్ మాట్లాడతా. బండి సంజయ్ నోటి నుండి హిందుత్వం ఆగిపోయిన నాడు నా శ్వాస ఆగిపోయినట్లే. బరాబర్ మాట్లాడి తీరుతా. బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వం. ఆ హిందుత్వంతోనే వరుసగా 3 సార్లు కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాం. పహల్గాంలో అవయవాలు చూసి హిందువులను కాల్చి చంపారు. హైదరాబాద్ ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. నిజామాబాద్ లో ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్ ను చంపారు. డీసీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. మరి అట్లాంటప్పుడు హిందుత్వం మాట్లాడాలా? వద్దా? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు అధికారంలోకి దాదాపు వచ్చేసినంత వాతావరణ ఏర్పడింది. ఎట్లా ఏర్పడిందో తెలుసా? హిందుత్వంవల్లే. నేను హిందుత్వం కోసం, ప్రజల కోసం పోరాటం చేయాలనే అమిత్ షా చెప్పి నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. హిందువులను ఓటు బ్యాంకుగా మార్చాం కాబట్టే జీహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లుంటే… 48 స్థానాలను గెలిపించగలిగాం. హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ హేళన చేస్తే హిందువులంతా ఒక్కటై బీఆర్ఎస్ ను ఓడించి హిందువుల సత్తా చూపారు. గల్లా ఎగరేసి చెబుతున్నా..కరీంనగర్ లో హిందూ ఓటు బ్యాంకు ద్వారానే నేను ఎంపీగా గెలిచిన. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో వేలాది మంది హిందుత్వం కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేసి రామరాజ్యం కోసం కష్టపడి పనిచేశారు. ముస్లింలను పొగుడుతున్న పార్టీల నోట కూడా ‘‘జై శ్రీరాం’ అనే మాట రావాలనే కసితో పనిచేస్తున్నా.నేనడుగుతున్నా….ముస్లింలకు మోదీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తోంది కదా? ఉచితంగా బియ్యం హిందువులకే కాదు ముస్లింలకు ఇస్తున్నారు. జాతీయ రహదారులు, కిసాన్ సమ్మాన్ నిధులుసహా సంక్షేమ పథకాలన్నీ హిందు, ముస్లిం, క్రైస్తవులు అనే తేడాలేకుండా అందరికీ ఇస్తున్నారు కదా? మరి ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు?. ఎన్నికలు జరిగితే ఇమామ్ లు, మౌలానాలు మసీదుల్లో మీటింగ్ పెట్టి ముస్లింలంతా ఒక్కటై బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రతిజ్ఝ తీసుకుని ఎందుకు ఓట్లేస్తున్నరు. ఒక్కసారి గుండెమీద చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి. 12 శాతం ముస్లింలు ఒక్కటై బీజేపీకి వ్యతిరేకంగా కరెక్టా? 80 శాతం మంది హిందువులను ఏకం చేసి ఓటు బ్యాంకు మారుస్తానంటే తప్పా? కాషాయ జెండా కన్పిస్తేనే అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు… 15 నిమిషాల టైమిస్తే హిందువులను కాల్చి చంపుతామని బెదిరించిన ఒవైసీని అరెస్ట్ చేయకుండా ఆయనతో కలిసి అంటకాగుతుంటే ఏమనాలి? ఎక్కడైనా మసీదులు కూల్చామా? లేదే… కానీ దేవాలయాలను ఎందుకు కూలుస్తున్నారు? గో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ముస్లిం మహిళలు మా ఆడబిడ్డలుగా భావించి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వ్యతిరేకించినా ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చిన ఘనత మోదీదే. ముస్లిం మహిళలు సంతోషంగా ఉండటం ఆ పార్టీలకు ఇష్టం లేదు. అయినా ఆ పార్టీలు సెక్యులర్ పార్టీలట. మేం మాట్లాడితే మతతత్వ వాది అంటారా? అట్లయితే మేం బరాబర్ మతతత్వవాదినే. ఇదే హిందుత్వ వాదంతో గడపగడపకూ తిరుగుతా. తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం.