భీమదేవరపల్లి అక్టోబర్ 30(మానేటి న్యూస్):



మెంథా తుఫాన్ మండల వ్యాప్తంగా రైతులను నిండా ముంచేసి కన్నీరు మిగిల్చింది.బుధవారం ఏడతేరిపి లేకుండా కురిసిన వర్షాలతో చేతికి అందవచ్చిన పంటలు నీట మునిగాయి.వరి,పత్తి,మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కంటనీరు పెట్టుకున్నారు.ఎకరానికి నలభై వేలవరకు పెట్టుబడి పెట్టామని,లక్షల్లో నష్టం వాటిల్లిందని, ఆవేదన వ్యక్తం చేశారు.భారీ వర్షాల వల్ల పత్తి తడిసి ముద్దయి ఏరెందుకు వీల్లేకుండా పోయింది.రైతులు ఆరబోసిన వడ్లు,మక్కలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.భారీ వర్షాలతో పొలాలు నీట మునియాయి. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.*ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు*స్వర్గీయ మాజీ ప్రధాని పీవీనర్సింహా రావు గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావం తో బుధవారం ఏడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో రైతులకు అపార నష్టం జరిగింది.గ్రామంలోని ఓల్లాల తిరుపతి ఐదు ఎకరాలు,ఓల్లాల రమేష్ ఏడు ఎకరాల్లో వరి సాగు చేశారు.వరి కోత కోసి వడ్లను కల్లాలో ఆరబోశారు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.దీంతో చేతికి అంద వచ్చిన పంట నీటి పాలు కావడంతో కన్నీరు మున్నీరయ్యారు.దాదాపు ఒక్కోక్కరికి 5 నుండి 6 లక్షల వరకు పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నవించారు.