
తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య త్యాగం.
నేటికీ ప్రజాస్వామ్య పోరాటానికి దీపస్తంభం.
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3
హైదరాబాద్,తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసి అమరుడైన పోలీస్ కిష్టయ్య సేవలు, త్యాగం నేటికీ ఉద్యమ చరిత్రలోవెలుగొందుతున్నాయి. ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఆయన నిలదీసిన ధైర్యం, నిబద్ధత ఎంతో మందికి ఉద్యమ స్పూర్తిని అందించింది. ప్రాంతీయ అసమానతలు, ప్రజల కష్టాలు, రాష్ట్ర హక్కుల కోసం సాగిన పోరాటంలో పోలీస్ కిష్టయ్య ప్రజలతో కలిసి నడిచారు. ఉద్యమ పతాకాన్ని మరింత బలపరిచే క్రమంలో ఆయన చేసిన త్యాగం తెలంగాణ భావజాలాన్ని శాశ్వతంగా ప్రభావితం చేసింది. కిష్టయ్యలాంటి అమరవీరుల త్యాగమే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి దిశగా పయనం కొనసాగించడం మనందరి బాధ్యత.