
మానేటి న్యూస్ నవంబర్ 1
చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/
• అతివృష్టితో రైతులు నష్టపోతే ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
• కొనుగోలు సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్..
చిగురుమామిడి:తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి చేతికి రావలసిన పంటలను రైతులు నష్టపోతే వారిని ఓదార్చాల్సింది పోయి ముసలి కన్నీరు కారుస్తూ బిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,చిన్నమూల్కనూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్ ధ్వజమెత్తారు.శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మూల్కనూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను,నష్టపోయిన వరి పంటలను సందర్శించిన అనంతరం పూదరి వేణుగోపాల్ గౌడ్ మీడియాతో మాట్లాడారు..వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని,సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాల ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.అధికారులతో యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో సర్వేలు చేయించి బాధిత రైతులను గుర్తించి ఎకరాకు 10వేల రూపాయలు,మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా, పొలంలో ఇసుక మేటలను తొలగించేందుకు ఎకరాకు లక్ష రూపాయలు, ఇండ్లు మునిగిపోయిన వారికి 15వేలు, గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులను ఆదుకునేందుకు సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు తన వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇబ్బందుల్లో ఉన్న రైతుల వద్దకు వచ్చి రాజకీయం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.10సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులు వడగండ్ల వర్షాలతో నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వని బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గజ్జేల రాములు,అందే సురేష్, నాయకులు పైడిపల్లి సతీష్,జిల్లెల శ్రీనివాస్,దొబ్బల మధు,తదితరులు ఉన్నారు.