Blog

  • మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా.- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

    A4 మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా..

    మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు.జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా ప్రక్రియ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది.జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు గాను గీత కార్మికులకు 17, ఎస్సీలకు 9 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. సెప్టెంబర్ 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరణ మొదలుపెట్టి దరఖాస్తులు ఈ నెల(అక్టోబర్) 23వ తేదీ వరకు స్వీకరించారు. మొత్తం 2,730 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి వి. శ్రీనివాస రావు, ఎక్సైజ్ సీఐలు, ఎస్ ఐ లు పాల్గొన్నారు.

  • Hello world!

    Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!