Blog

  • జోరు పెంచిన కాంగ్రెస్.. మంత్రులకు కీలక బాధ్యతలు..

    సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

    జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్నగర్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బోరబండ-సీతక్క, మల్లు రవి. వెంగల్రావునగర్- తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి. సోమాజిగూడ-శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్. షేక్పేట- కొండా సురేఖ, వివేక్. ఎర్రగడ్డ-దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు. యూసఫ్గూడ-ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు బాధ్యతలు అప్పగించారు.

  • గుండె ఆపరేషన్ కోసం రక్తదానం చేసి ఆదుకున్న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి. ఓ నెగటివ్ రక్తాన్ని 67 సార్లు దానం చేసిన బేతి మహేందర్ రెడ్డి. రక్తదానం చేయండి..ప్రాణదాతలుగా నిలవండి. బీజేపీ నేత, రక్తదాత బేతి మహేందర్ రెడ్డి పిలుపు..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    ప్రమాదకర పరిస్థితిల్లో అత్యంత అరుదైన “ఓ నెగటివ్” రక్తాన్ని గత 31 ఏళ్లుగా దానం చేస్తున్నానని, ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడడంతో పాటు నేటివరకు 67 సార్లు రక్తదానంతో పాటు ప్లేట్ లెట్స్, ప్లాస్మా దానం చేయడం జరిగిందని బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన గుర్రం ఆగయ్య (70 ఏళ్లు) అనే వ్యక్తి కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ దవాఖానలో తీవ్రమైన గుండె నొప్పితో భాదపడుతూ చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించడంతో పేషెంట్ కు ఓ నెగటివ్ రక్తం అత్యవసరం కాగా నగరంలోని ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా పేషెంట్ బంధువులు బేతి మహేందర్ రెడ్డి ని ఫోన్ ద్వారా సంప్రదించగా వెంటనే వెళ్లి ఓ నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ రక్తదానం చేయడం ద్వారా నేటివరకు 67 సార్లు ఓ నెగటివ్ రక్తాన్ని దానం చేయడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా రోగి ప్రాణాలు కాపాడడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా రక్షించినవారమవుతామని, అలాగే రక్తదానం చేయడం ద్వారా మనకు కొత్త రక్తం రావడమే కాకుండా ఆరోగ్యoగా ఉంటామని, అందుకే ఎలాంటి భయాలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి కోరారు. రక్తదానం చేసిన బేతి మహేందర్ రెడ్డిని బీజేపీ శ్రేణులు, న్యాయవాదులు, 40వ డివిజన్ వాస్తవ్యులు, శ్రేయోభిలాషులు అభినందించారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

  • శ్రీ వర్షిత ఆత్మహత్య పై.. రాజకీయాలు మానుకోవాలిబీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్..

    భీమదేవరపల్లి అక్టోబర్ 28(మానేటి న్యూస్)

    భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోనీ పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటపై రాజకీయ పక్షాలు చేస్తున్న రాజకీయం మానుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించారు.అనంతరం మాట్లాడుతూ శుక్రవారం రోజున ఉరి వేసుకుని చనిపోయిన 10వ తరగతి విద్యార్థినీ శ్రీ వర్షిత మృతి అందరినీ బాధకు గురి చేసిందని,ఇది తట్టుకోలేని సంఘటన అని మరల ఎటువంటి సంఘటన మరల జరుగుకుంట చూడాలన్నారు.అదేవిదంగ ఎప్పుడు జరిగిన సంఘటన గల కారణాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.అప్పటివరకు ఈ విషయం పై ఎవరు రాజకీయాలు చేయవద్దన్నారు.ఈ విషయలను సోషల్ మీడియా లో చూసి పిల్లలు భయపడుతున్నారని కావున వారిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను చేయకూడదన్నారు.అదేవిధంగా స్కూల్లో ఓపెన్ చేసి పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వారు ధైర్యంగా ఉండడానికి స్టాఫ్ ని ఎక్కువ సంఖ్యలో రాత్రివేళలో ఉంచాలని, స్టాఫ్ ను వారి యొక్క క్వార్టర్స్లోఉండాలని ప్రిన్సిపాల్, స్టాఫ్ కి తెలియజేసినారు.శ్రీ వర్షిత తండ్రి వనం తిరుపతి శక్రవారం రోజు వారి కూతురు యొక్క జ్ఞాపకాలను చూడ్డానికి స్కూల్ కి రావడం జరిగింది.వారిని పిల్లల యొక్క తల్లిదండ్రులు,గ్రామస్తులు వారిని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు శ్రీరామోజు శ్రీనివాస్,బత్తిని శ్రీనివాస్, ఆవుల రాజయ్య,షేక్ అలీ, లింగన్న ,గ్రామస్తులు శ్రీరామోజు మొండయ్య,ఒల్లాల రమేష్,రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, గజ్జల సంజీవ్,పొన్నాల తిరుపతిరెడ్డి, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

  • మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల నిర్మూలన..

    మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

    మిషన్ పరివర్తన నషా ముక్తి భారత్ అభియాన్ సే నో టు డ్రగ్స్ – ఎస్ టూ డ్రీమ్స్ & గోల్స్ కార్యక్రమం.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఇటిక్యాల మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. భారతదేశంలో డ్రగ్స్ మరియు ఆంటీ డ్రగ్స్ వ్యవస్థ విచ్చలవిడిగా కొనసాగుతుందని మరియు డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని, నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 ఆగస్టు 15న ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగానే పిల్లలకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం, చికిత్స మరియు మాదక ద్రవ్యాలను అలవాటు పడిన వారిని పునరావాస కల్పించడం, మాదక ద్రవ్యాల నియంత్రణ, వినియోగాన్ని నిషేధించడం అనే విషయం పై అవగాహన కల్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి మొదటి,రెండవ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ప్రాజెక్ట్ CDPO మమత, సూపర్వైజర్స్ భాగ్య, సువర్ణ, నరేష్ DHEW అకౌంటెంట్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కొల్లూరి సంతోష్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • పుస్తె మట్టెలు పంపిణి చేసిన కరీంనగర్ ఆర్యవైశ్య నేతలు..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    వీణ వంక మండలం బొంతు పల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆర్య వైశ్య కుటుంబానికి చెందిన అమ్మాయి నవ్య వివాహం నవంబర్ 1 తేదీన నిశ్చయించడం కావడంతో , ఆ నిరుపేద నిరుపేద వివాహ కుటుంబానికి సహాయం చేయడానికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య నేతలు ముందుకు వచ్చారు .కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ దాతల సహకారం తో కరీంనగర్ లోని వైశ్య భవన్ లో పెళ్లికూతురు కి చీర, పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా. రాజేందర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇకముందు కూడా చేస్తామని తెలిపారు,మమ్మల్ని ప్రోత్సాహస్తూ సహాయం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది వేణు గోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, బొడ్ల శ్రీరాములు, తిరుపతి, అలెంకి సంతోష్ రాజ్, సంతోష్, కిరణ్ కుమార్ తో పాటు అమ్మాయి బంధువులు పాల్గొన్నారు.

  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ..

    మానేటి న్యూస్ (హుజురాబాద్ విలేకరి సంపత్ మట్టెల అక్టోబర్ 28)

    పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్‌ డివిజన్‌ పరిధిలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజపల్లి మీదుగా తిరిగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ముగిసింది.ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ మాధవి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేసుకోవాలని, వ్యాయామం ద్వారా అనేక రుగ్మతలను దూరం పెట్టుకోవచ్చని సూచించారు.అలాగే ఈ నెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రక్తదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి అర్పించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్‌ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, రూరల్‌ సీఐ లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

  • తీగల గుట్టపల్లిలో ఘనంగా ఛత్ పూజ పండగ..

    మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28/

    కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లి 2వ డివిజన్ లో ఉత్తరప్రదేశ్ సోదర సోదరీమణులు ఛత్ పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తీగలగుట్టపల్లి ఫోటో డివిజన్లోని బతుకమ్మ కుంట వద్ద ఈ పూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ పాల్గొని , అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • సిజెఐ”బిఆర్ గవాయ్ పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి…చలో నవంబర్ 1న హైదరాబాద్ ను విజయవంతం చెయ్యాలి..

    సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 28/

    సుప్రీం.కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బిఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం రోజున సైదాపూర్ లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంఘాల తిరుపతి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో విహెచ్పిఎస్ ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ పి అనుభంద సంఘల మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి పై జరిగిన దాడి ఉద్దేశ పూర్వకంగా జరిగిన దాడి ఇది, ఈ సంఘటన న్యాయ వ్యవస్థ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై, దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటామన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటగా తీసుకొని దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు .”నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు”సైదాపూర్ మండలo నుండి ప్రతి గ్రామo నుండి బస్సులను ఏర్పాటు చేసుకొని అధిక సంఖ్యలో జనం తరలివచ్చి హైదరాబాదులో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జక్కోజు బిక్షపతి, సైదాపూర్ మండల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మట్టెల రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సైదాపూర్ మండల అధికార ప్రతినిధి పొడిశెట్టి అజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొరగల రమేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

  • జగిత్యాల పట్టణ అభివృద్ధికి రూ.140 కోట్లతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్రూ. 62.50 కోట్ల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..

    మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 28/

    జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ. 62.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ముఖ్యాంశాలు:జగిత్యాల మున్సిపాలిటీకి రూ.62.50 కోట్ల నిధులురూ.140 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయిమూడు జాతీయ రహదారులు మంజూరుమాస్టర్ ప్లాన్ ద్వారా సమగ్ర విస్తరణసీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలుఎమ్మెల్యే మాట్లాడుతూ, “2023లోనే సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం సమర్పించాను. అదే రోజు సీఎం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ చివరి వారంలో రూ. 32 కోట్లు విడుదల కావడంతో డ్రైనేజీ, కరెంట్‌, రోడ్ల వంటి పనులు ప్రారంభించాం,” అని తెలిపారు.అమృత్‌ పథకం కింద తాగునీటి సరఫరా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసినట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మరలా కలిసి మరిన్ని అభివృద్ధి నిధులు కోరగా రూ. 62 కోట్ల పైన నిధులు ఆమోదించారని తెలిపారు.జగిత్యాల పట్టణ విస్తీర్ణం పెరిగేందుకు ధరూర్, తిప్పన్నపేట్, లింగంపేట్, హస్నాబాద్ మోతే, టీఆర్‌నగర్, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలు కలపడం ద్వారా ప్రభుత్వ స్థలాలు పెరిగాయని వివరించారు. రైతులకు నష్టం లేకుండా, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.“వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరాల కోసం పని చేయాలి. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజల సూచనలు తీసుకుంటాం. ప్రజల భాగస్వామ్యంతోనే జగిత్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని ఎమ్మెల్యే అన్నారు.జిల్లా కేంద్రంగా మూడు జాతీయ రహదారులు మంజూరు అయ్యాయి, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రూ. 140 కోట్లతో జరుగుతున్న పట్టణ అభివృద్ధి పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తవుతాయి అని తెలిపారు.అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్‌లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు బాలే శంకర్, డిష్ జగన్, కుసరి అనిల్, చెట్పల్లి సుధాకర్, గుర్రం రాము, చందా పృథ్వీ, పిట్ట ధర్మరాజు, జంబర్తి రాజ్‌కుమార్, అహ్మద్, ప్రవీణ్ రావు, పోటునుక మహేష్, రంగు మహేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

  • కమలాపూర్ లో సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో డ్రంక్ డ్రైవ్- వాహనాల తనిఖీలు ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తం — తాగి వాహనాలు నడిపేవారిపై చర్యలు..

    సాగర్ మానేటి న్యూస్, కమలాపూర్ అక్టోబర్ 28/

    కమలాపూర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు సుదీర్ఘ తనిఖీలు నిర్వహించారు. కమలాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది భారీగా వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి వాహనదారుడి వద్ద లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్స్యూరెన్స్ వంటి వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా తాగి వాహనాలు నడిపే వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు బ్రీత్ అనలైజర్ యంత్రాలతో పరీక్షలు చేపట్టి, మద్యం సేవించి వాహనం నడిపిన వారిని హెచ్చరించారు.సీఐ హరికృష్ణ మాట్లాడుతూ — “రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మద్యం సేవించి వాహనం నడిపితే కేవలం చట్టపరమైన శిక్షలు మాత్రమే కాదు, మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది” అని అన్నారు. అలాగే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, “తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. వాహనం నడిపే ముందు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు పత్రాలు వెంట ఉంచుకోవాలి. హెల్మెట్, సీటు బెల్ట్ వంటి రక్షణ సాధనాలు తప్పనిసరిగా వాడాలి” అని సూచించారు.ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రధాన ధ్యేయమని సీఐ హరికృష్ణ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.