ఈ నెలలోనే నోటిఫికేషన్, డిసెంబర్ లో ఎన్నికలు”
“పాత రొటేషన్ పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు”
“డెడికేటెడ్ కమిటీ నివేదిక తూ… తూ… మంత్రమే”
“కోర్టు తీర్పులు పాటించాల్సిందే – గవర్నర్ ఆర్థినెన్స్ ఆమోదం గగనమే”
“అనధికారంగా అన్ని పార్టీలు 42 శాతం రిజర్వేషన్ పాటిస్తాయి”
చట్టం రానిది బీసీ రిజర్వేషన్ అడుక్కోవడమే హక్కు“
మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 21
హైదరాబాద్,తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఈసారి అనేక చట్టపరమైన, రాజకీయపరమైన సంక్లిష్టతలతో సాగుతోంది. బీసీ రిజర్వేషన్ శాతం పెంపు, హైకోర్టు తాత్కాలిక ఆంక్షలు, గవర్నర్ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్, పాత, కొత్త రిజర్వేషన్ రొటేషన్ వ్యవస్థలపై గందరగోళం అవుతున్నాయి.
“ప్రస్తుతం ఏ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు”
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించినా, హైకోర్టు ప్రస్తుత ఎన్నికలు పాత రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ప్రకారం నిర్వహించాలి అని స్పష్టం చేసింది. అంటే పూర్వంలో అమల్లో ఉన్న ఎస్సి, ఎస్టీ,బీసీ రిజర్వేషన్ శాతం గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో పాత రొటేషన్ వ్యవస్థ ప్రకారం 33 శాతం మహిళా రిజర్వేషన్ (ఎస్సి, ఎస్టీ,బీసీ వర్గాలలొనే) ఇవి యథాతథంగా అమలవుతాయి. బీసీ –42% రిజర్వేషన్ ఈ ఎన్నికల్లో అమలు కావడం కలగానే మిగిలిపోనుంది.
“ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు ఇలా”
రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే పనిలో పడింది. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ ప్రభుత్వం వారోత్సవాలు, ఇందిరమ్మ చీరల పంపిణి, కొన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రకటిత పథకాలు ప్రజలకు ఇచ్చి ఎన్నికల్లోకి పోవాలనే ఆలోచనతో ఉంది. ఎంపీటీసీ –జడ్పీటీసీ ఎన్నికలు గ్రామీణ స్థానిక సంస్థల మొదటి విడత, విడత, రెండవ విడతల ఎన్నికలు ముందు నిర్వహించలని అనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానిక పంచాయతీ ఎన్నికలు పెట్టనిది నిధులు విడుదల చేయబోము అని హుంకరించదవడంతో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకే ముందుగా వెళ్లాలని అనుకుంటుంది. జిల్లాల వారిగా మూడు దశలో సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికలు, రెండు దశల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించెందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సిద్ధం అవుతుంది. కాగా ఈ నెల 24 న డెడికేటెడ్ కమిటీ నివేదిక హైకోర్టుకు సమర్పించిన తరువాత కోర్టు ఆదేశం ప్రకారం ఎలాంటి తాత్సరం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వవాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోరుకుంటుంది. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఒకేసారి నామినేషన్లు తీసుకొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 24 లేదా 25 నాడు నోటిఫికేషన్ విడుదల, నవంబర్ 26 నుంచి నామినేషన్లు, డిసెంబర్ మొదటి వారంలో పంచాయతీ మొదటి విడత పోలింగ్, మూడు రోజుల వ్యవదిలో మరో రెండు విడతల పోలింగ్ ఉంటుంది. 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయిపోగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొతంగా రెండు ఎన్నికలు కలిపి 5 విడతల్లో డిసెంబర్ నెల లోపు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల సంఘం పెద్ద కసరత్తే చేస్తుంది.
“గవర్నర్ ఆర్డినెన్స్ ఏ స్థితిలో ఉంది”
బీసీ 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ఆమోదించి, జీవో విడుదల చేసినప్పటికి, హైకోర్టు ఆయా ప్రక్రియ తాత్కాలికంగా హైకోర్టు నిలిపివేసింది. గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ తీర్మానం ఇంకా పరిశీలన దశలోనే ఉంది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించిన కొత్త రిజర్వేషన్ చట్టం అమలులోకి రాదు, భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ అవకాశం ఉంటుందని పలువురు వాదన. ఇతర రాష్ట్రాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఉన్నందున తెలంగాణలోనూ అమలు చేసే దిశగా ఒక రాజకీయ నినాదం ఇప్పటికే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ఒక పాలసి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నినాదం రాజకీయ దుమారం లేవకముందే బీజేపీ జాతీయ స్థాయిలో బీసీలకు స్థానిక రిజర్వేషన్ ఇచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్దిపొందే పనిలో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో బీసీ వర్గీకరణ ఆధారంగా అధిక రిజర్వేషన్ ఇస్తూ ఆయా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయని, వాటిని దెబ్బ కొట్టాలంటే జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ సవరణ ఒక్కటే మార్గమని బీజేపీ బావిస్తుంది. ఇదే జరిగితే బీసీ ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో నెరవేరి, చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం మరో పోరాటానికి బీసీలకు మార్గం సుఘమనం అవుతుంది. రిజర్వేషన్ మొత్తం 50 శాతం దాటితే అది న్యాయపరంగా సవాలు అవుతుంది.
“రోటేషన్ పద్ధతి రిజర్వేషన్ అమలు”
కెసిఆర్ హయాంలో ఉన్న ఒకే రిజర్వేషన్ రెండుసార్లు అనే నియమం ఈసారి సైతం అమలులోకి వస్తుంది. పంచాయతీరాజ్ సవరణ చట్టంలో ఉన్న ఒకే రిజర్వేషన్ వరుసగా రెండుసార్లు రావచ్చనే క్లాజ్ ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది. ఆ చట్టం రద్దు కాకుండ ప్రస్తుతం ఎన్నికల రిజర్వేషన్ చెల్లుబాటు కాదు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పాత రొటేషన్ వర్తిస్తున్నందున, ఆయా గ్రామాల్లో అదే రిజర్వేషన్ వచ్చే వీలుంది. కొత్త రిజర్వేషన్ ఆర్డినేన్స్, జీవో అమలులో చట్టపరంగా లోపాలు ఉన్నందున పాత రొటేషన్ పద్ధతినే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది.
“పార్టీలు BC రిజర్వేషన్ అంశాన్ని ఉపయోగించుకొనే ఛాన్స్”
బీసీలకు మేము ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్ తమ నినాదం అంటూ కాంగ్రెస్ పార్టీ దీన్నే ఈ ఎన్నికల్లో పెద్ద రాజకీయ ఆయుధంగా చేసుకుంటుంది. అధికార పార్టీగా బీసీ ఓటు బ్యాంక్‌ను గట్టిగా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో ముందు వరసలో ఉంటుంది. బీజేపీ పార్టీ మాత్రం ఇది “కాంగ్రెస్ రాజకీయ స్టంటని, చట్టభద్ధంగా రిజర్వేషన్ అమలు చేసే దమ్ములేక కాంగ్రెస్ తప్పుడు పద్ధతుల్లో బీసీలను మోసం చేస్తుందనే ప్రచారం తీసుకున్ ప్రచారం చేస్తోంది. బీసీలకు మేమే నిజమైన రాజకీయ మిత్రులమని జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే పనిలో మేము. ఉన్నామని బీజేపీ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. టికెట్ పంపిణీలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతను ఎత్తి చూపే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ తమ పాత బీసీ మద్దతును తిరిగి పొందేందుకు దూసుకెళ్తోంది. రిజర్వేషన్ కాదు, అసలు అభివృద్ధి కావాలనే ప్రచారం వైపు మొగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
“వాస్తవానికి లబ్ధి పొందే పార్టీ”
గ్రామీణ తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్నందున, అభ్యర్థి ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్‌కు ప్రత్యక్ష లాభం అవుతుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీలను మిస్ అయితే నష్టం జరుగుతుందనేది ఇప్పటికే పసిగట్టి నష్ట నివారణ పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో బీసీ కొత్త ముఖాలను పరిచయం చేసే పనిలో టీపీసీసీ బిజీగా ఉంది.
“ఈ ఎన్నికల్లో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్సాహం ఉందా”
ప్రజల్లో గ్రామస్థాయిలో పంచాయతీ ఎన్నికలపై ఎప్పటికంటే ఎక్కువ చర్చ ఇప్పుడు జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ విషయం కారణంగా ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఇంకా పెరిగింది. పోటీ అభ్యర్థుల్లో
ముందులా “గెలుపు ఖాయం” అన్న ఊపు తక్కువే అయినప్పటికీ బీసీ ప్రాధాన్యతపై కొత్త నాయకత్వానికి ఆశలు ఉన్నాయి. రిజర్వేషన్ మార్పు, కోర్టు కేసులు, తేదీల గందరగోళం వల్ల అభ్యర్థుల ప్రణాళికల్లో నిర్లిప్తత లోపల ఉన్న పార్టీ మద్దత్తుపై, ఎమ్మెల్యేల, ఎంపీల, నాయకుల అన్ని రకాల మద్దతుపై అభ్యర్థులకు ఉన్నాయి. ఆయా పార్టీల స్థానిక కేడర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కొంత ఆత్మవిశ్వాసం కలిగి అభ్యర్థులు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో శక్తి పెరిగినప్పటికీ, గ్రామ స్థాయిలో అభ్యర్థులు, పార్టీ అంత శక్తివంతంగా లేదు. బీఆర్‌ఎస్ తిరిగి బలపడి నిలబడేందుకు ఇంకా కష్టపడుతోంది. అనేక ప్రభుత్వ మార్గలు, కాంగ్రెస్ వర్గ బేధాలు, ఎమ్మెల్యేల పనితీరును ప్రజల్లో పలుచన చేసి లబ్ది పొందే మార్గలు వెతుకోచ్చు. కాగా తెలంగాణ గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎన్నికలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలుగా, ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ అంశం ఒక జాతీయ రాజకీయ ప్రయోగం కానుంది.
“డెడికేటెడ్ కమిటీ నివేదిక ఎం సూచనలు చేస్తుంది”
తెలంగాణలో స్థానిక సంస్థల పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికల కోసం ముందు ఒక ముందు చూపుగా హైకోర్టు సూచించిన
కమిటీ. ఇది స్థానిక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటాను వెరిఫికేషన్ చేస్తూ నివేదికను కోర్టుకి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిటీ (బీసీ పర్యవేక్షణ కమిటీ) వివిధ సామాజిక-ఆర్థిక డేటా విశ్లేషణ అనంతరం ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం స్థానిక సంస్థలలో బీసీల కోసం కనీసం 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సిఫార్సు చేయనుంది. కమిటీ నివేదికపై ఆధారంగా ప్రభుత్వం పలు కీలక జీవోలు, బిల్లు మార్పులు తీసుకు వచ్చి రిజర్వేషన్ పెంపుని అమలు చేయాలని కోరుతుంది. అయితే ఆ నివేదిక అమలు మాత్రం పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలు, సవరణలు అనుసరించే హైకోర్టు తుది ఆదేశాలు ఉంటాయి.
బీసీ రిజర్వేషన్ పెంపు కల్పించే హైకోర్టు స్టే తీర్పులో ట్రిపుల్-టెస్ట్ సుప్రీమ్ కోర్ట్ నిర్దేశిత ప్రమాణాలు అనుగుణమవ్వాలి అనె విషయం పేర్కొన్నది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని జీవోలపై ఇప్పటికే న్యాయపరిశీలన కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికలను పాత రిజర్వేషన్ పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువ. డెడికేటెడ్ కమిటీ నివేదికను సామాజిక న్యాయానికి కీలకమైన దశగా ప్రభుత్వం పేర్కొన్నప్పటికి అది న్యాయ సూత్రాలను ప్రస్తుతం ప్రభావితం చేయదు. కొంత మందికి ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తుందని విమర్శలు చేస్తున్నారు.
డెడికేటెడ్ కమిటీ నివేదిక తుది రూపంలో పొందితే స్థానిక సంస్థల సీట్లు, రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా పరిష్కరించే అవకాశం ఇప్పట్లో లేదు. ఈ నివేదిక భవిష్యత్తు ఎన్నికల్లో మాత్రం ఉపయోగపడే అవకాశం ఉంది. హైకోర్టు స్టే వలన ప్రస్తుతం ఎన్నికలు పాత రెగ్యులర్ రిజర్వేషన్ ఆధారంగా జరగాల్సి వస్తుంది. హైకోర్టు ఈ కేసును త్వరగా పరిష్కారమవడం ద్వారా కమిటీ నివేదికపై తుది న్యాయ పరిశీలనకు వీలవుతుంది. తీర్పు వచ్చిన తరువాతే ప్రభుత్వం గవర్నర్ ఆమోదం/జీవో మార్పులతో కట్టుబడి రిజర్వేషన్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన తుది షెడ్యూల్-నోటిఫికేషన్ ఇలాగే న్యాయపరిణామాలపై ఆధారపడి మార్చవచ్చు. ఏది ఏమైనా డెడికేటెడ్ కమిటీ నివేదిక సూచనలు స్థానిక రాజకీయాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. అయితే న్యాయ పరంగా మార్గదర్శకత విడుదలలపై స్టే, హైకోర్టు పర్యవేక్షణ కారణంగా తక్షణ ప్రయోజనాలు కమిటీ నివేదికతో జరిగేదదేమి లేదు.