
భీమదేవరపల్లి డిసెంబర్ 2(మానేటి న్యూస్):
భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా చిట్యాల శిరోమణి గెలుపు బాటలో ముందంజలో ఉందంటున్న గ్రామ ప్రజలు ,తను ప్రజలతో,,విద్యార్థులతో ,మహిళలతో ,గ్రామ ప్రజలను కలుపుకొని ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకొని గ్రామంలో ఉన్న నీటి సమస్య, డ్రైనేజీ ,రహదారి, సిసి రోడ్లు ,పారిశుద్ధ్యం ,వీధి దీపాలు తో పాటు గ్రామంలో ఉన్న వివిధ సమస్యలను తెలుసుకొని ఇంటింటికి తిరిగి నన్ను గెలిపించాలని కోరారు మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ఉపాధి నైపుణ్యత, మహిళ లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని, గ్రామములో సీసీ కెమెరాలు ఏర్పాటు, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తానని, గ్రామంలో ప్రజా గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకపోతానని ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజల ఆశీస్సులతో విద్యావంతులు,మేధావులు, పార్టీలకతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలతోని మమేకమై గడప గడపకు తిరుగుతూ వారి యొక్క ఆశీస్సులను అందుకుంటూ తిరుగుతూ వారి యొక్క వివరాలు తెలుసుకుంటున్నారు .రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటడం ,ప్లాస్టిక్ నిషేధించడం ,డ్రగ్స్ గంజాయి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తానని అన్నారు.మీరు గెలుస్తారని ప్రజలు సైతం భరోసా ఇస్తున్నారు, గ్రామ సమస్యలపై అవగాహన ఉందని,ఇంతకుముందు గ్రామపంచాయతీలో వార్డ్ మెంబర్గా కొనసాగడం జరిగింది కాబట్టి పెద్ద మనసుతో పార్టీలకతీతంగా ప్రజలు ఈసారి భారీ మెజార్టీతో సర్పంచిగా గెలిపించాలని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామపంచాయతీకి ,గ్రామ ప్రజలకు సేవ చేస్తానని మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుచున్నాను.