




మానేటిన్యూస్ (హుజూరాబాద్ విలేఖరి మట్టెల సంపత్ నవంబర్ 18)
హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో మంగళవారం రోజున బెలూన్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ చాలా చక్కగా పాఠశాలకు వచ్చి అన్ని ఆక్టివిటీస్ లలో తప్పకుండా పాల్గొనాలని దీని ద్వారా విద్యార్థులలో సహకార భావం, సృజనాత్మకత పెంపొందుతాయని తెలియజేశారు. అదేవిధంగా ఈనాడు వారూ నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. తదనంతరం విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.