
మానేటి న్యూస్ నవంబర్ 18 తిమ్మాపూర్ ప్రతినిధి/
నేదునూరు గ్రామంలోని కరీంనగర్ డైరీ పాల కేంద్రంలో డైరీ అధ్యక్షురాలు వర్ణ పద్మ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాల ఉత్పత్తి దారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి కరీంనగర్ డైరీ మేనేజర్ సుధాకర్ మరియు సూపర్వైజర్ మల్లెత్తుల చందు ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల ఉత్పత్తిదారులకు మరింతగా పాల ఉత్పత్తులను పెంచే విధంగా మరియు పాడి పశువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ మరింత ఉత్పత్తులను పెంచాలని రైతులను కోరడం జరిగింది వారికి ప్రోత్సాహకరంగా బ్యాగులు పాల క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది.