
ఈనెల 11వ తేదీన జరుగునున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆ నియోజకవర్గ ఓటర్లకు పిలుపు నిచ్చారు. శుక్రవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్ పేటలోగల 61,62వ డివిజన్లలో ఆయన కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతోపాటు పార్టీ ముస్లీం నేతలు, మానకొండూర్ మండల నాయకులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతే కాకుండా మసీదుల వద్ద శుక్రవారం నమాజు వెళ్లి వచ్చిన ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టో ప్రతులతోపాటు పార్టీ అభ్యర్థి తాలూకూ ఎన్నికల కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ కు ఓటేసి నవీన్ యాదవ్ ను గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమ ఫలాలను అందించే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.అన్ని వర్గాల ప్రజల అభివద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గానికి చెందిన మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రిపదవి కట్టబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అనాదిగా ముస్లింల పక్షాన ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ఈ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, పార్టీ నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, బండి మల్లేశం, రామిడి తిరుపతి, బి.మహేందర్, సహదేవ్, చిరంజీవి, కనకం కుమార్, రమేశ్, అంకూస్,తాళ్లపల్లి నరేష్ గౌడ్, కోండ్ర సురేష్, ఇర్ఫాన్, మీస సత్యనారాయణ, బోళ్ల మురళీధర్, గుజ్జ రవీందర్,వేగోళం శ్రీనివాస్ గౌడ్, దుడ్డెల కుమారస్వామి, తాళ్ల కుమార్, సంగు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.