

జమ్మికుంట : కేంద్ర రాష్ట్ర ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ఈరోజు వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం రచించి ఇప్పటికీ 150 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన ఆలపించా లనే ఉద్దేశంతో ఈరోజు పారిశుధ్య కార్మికులు మున్సిపల్ అధికారు లతో ఘనంగా వందేమాతరం గీతా లాపన నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, జే ఏ ఓ రాజశేఖర్ రెడ్డి, ఏఈ వికాస్, సీనియర్ అసిస్టెంట్ వాణి, భాస్కర్, శ్రీనివాస్, సానిటరి ఇన్స్పెక్టర్ సదానందం, వార్డ్ ఆఫీసర్లతో పాటు పారిశుధ్య కార్మికులు పలువురు పాల్గొన్నారు.
