భీమదేవరపల్లి అక్టోబర్ 31మానేటిన్యూస్:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో (16)ఒక బాలిక,(6)బాలుడు, (55)మహిళా మృతి చెందారు.రెడ్డబోయిన శ్రీకాంత్ గ్రామం వెంకటాపురం మెదక్ చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురవి మండలం సుధన్ పల్లికి చెందిన నాగలక్ష్మి కి,సిద్దిపేట జిల్లావెంకటాపురం గ్రామానికి చెందిన భాస్కర్ కు 29వ తేదీన పెళ్లి జరిగినది.గురువారం మారుపెళ్ళి కోసం వీరి కుటుంబ సభ్యులు బంధువులు కలిసి బొలెరో వాహనంలో వెంకటాపురం వెళ్లి అక్కడ నుండి రాత్రి 8గంటలకు మళ్ళీ సుదనపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన కోసం వాహనాన్ని రోడ్డుకి పక్కకు ఆపుకొని ఉండగా మధ్యరాత్రి సమయంలో ఎల్కతుర్తి వైపు వెళ్లే బోర్వెల్ డీసీఎం అతివేగంగా ఆజాగ్రత్తగా వచ్చి వీరు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టగా రెడ్డబోయిన స్వప్న 16 సంవత్సరాలు,శ్రీనాథ్ ఆరు సంవత్సరాలు,కలమ్మ 55 సంవత్సరాలు మృతిచెందారు. అనసూయ, అక్షయ,మారుతి, రమాదేవి,దేవేందర్,నవలోక్, రిత్విక్,సరోజన,కార్తిక్ లకు గాయాలు కాగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్,శ్రీరామ్ రాజు గార్డెన్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని, అట్టి డీసీఎం వ్యాను నడిపిన డ్రైవర్ గడ్డం నాగరాజు పై చట్ట ప్రకారం చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.