
మానేటి న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గణేష్మం
మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం అంగన్వాడీ కేంద్రాలకు చెల్లించే గ్యాస్ , ఇంటి అద్దెలు, కూరగాయలు బిల్లులు వెంటనే చెల్లించాలి ట్రాన్స్ఫర్, ప్రమోషన్లు ప్రక్రియను పూర్తి చేయాలి ఐసిడిఎస్ చెన్నూరు ప్రాజెక్టు అధికారి సిడిపివో వినతిపత్రం అందించిన *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం రోజున చెన్నూరు ప్రాజెక్టు అధికారి సిడిపిఓ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ… అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ పేరుతో ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతుంది.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అంగన్వాడి ఉద్యోగులకి కనీస వేతనం 26వేలు చెల్లించాలి. రిటర్మెంట్ అయినా ఉద్యోగులకు తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.ఖాళీగా పోస్టులు వెంటనే భర్తీ చేయాలి.ఈ కార్యక్రమంలో కావేరి రవి సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు, బోడేంకి చందు వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ ప్రాజెక్టు సీఐటీయు నాయకులు సుగుణ రజియా ప్రవీణ, శారదా,అమృత రాజేశ్వరి, మానస, పుష్ప తదితర అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.