
మానేటి న్యూస్ అక్టోబర్ 31శంకరపట్నం/
శంకరపట్నం మండల పరిధిలోని కరీంపేట గ్రామంలో తల్లి కొడుకుల పైన గొడ్డలితో దాడీ.హత్య పై స్థానికుల కథన వివరాలు.. శంకరపట్నం మండల కరీంపేటగ్రామం లోని గడ్డం రాజు, గడ్డం మల్లవ్వ ,తల్లి,కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల మంగళ పల్లిగ్రామానికి చెందిన బంధువులు గొడ్డలితో దాడిచేసి దాడీ చేసినట్లు స్థానికులుతెలిపారు. దాడి చేసిన వారిలో రాజు భార్య స్వప్న,బామ్మర్ది కడారి శేఖర్, అత్త, మరో యువకుడు కలిసిగొడ్డలితో దాడి చేసినట్లు గ్రామస్తులు అంటున్నారు. దాడిలో రాజు,మల్లవ్వకు తీవ్ర గాయాలుఅయినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్నహుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్గ్రామస్తులను విచారణ చేశారు. గాయపడిన వారిని108 వాహనములు లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికితీసుకువెళ్లారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూగడ్డం మల్లవ్వ మృతి చెందగా గడ్డం రాజు పరిస్థితివిషమంగా ఉన్నట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు .సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.