
భీమదేవరపల్లి అక్టోబర్ 30 ( మానేటి న్యూస్):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని రోడ్డంపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని గిన్నారావు కుమారస్వామి ఆధ్వర్యంలో వంగర గ్రామస్తులు గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వర్షాకాలంలో రోడ్డం పై నుండి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రొడ్డం దాటి వెళ్లే ప్రయాణికులు,వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేసి గ్రామస్తులు,ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు.ఈ కార్యక్రమంలో ఒల్లాల అనిల్, ఎర్రబెజ్జు కృష్ణ, ఇల్లందుల కుమార్, మిడిదొడ్డి తిరుపతి కార్యక్రమంలో పాల్గొన్నారు