
మానేటిన్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ డిసెంబర్ 3
ప్రజాపాలనప్రజావిజయోత్సవాల భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.262.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి, రూ.45.15 కోట్లతో ATC (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటుకు, రూ. 20 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు, రూ. 8.60 కోట్లతో ఆర్టీఏ యూనిట్ ఆఫీసుకు, రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్-కొత్తపల్లి ప్యాకేజీ-1, 4 లైన్ రహదారికి, రూ.58.91 కోట్లతోహుస్నాబాద్–అక్కన్నపేట 4 లైన్ రహదారి శంకుస్థాపనలు చేశారు.విధ్వంస పాలనకు తెరపడింది. సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిమంత్రితుమ్మలఅనంతరం బహిరంగ సభ వేదిక కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు, ATC, 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, నాలుగు లైన్ రోడ్ల మంజూరును ప్రస్తావిస్తూ ప్రజా పాలన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.ఐ డోంట్ కేర్.. మేనేజర్ వేధింపులు భరించలేక ఉద్యోగి ఆత్మహత్య
హుస్నాబాద్ గ్రామీణ ప్రాంతం విద్యా వ్యాప్తికి మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని, పాడి పశు సంపద అధికంగా ఉండటంతో రైతులకు పాల ఉత్పత్తి రంగంలో ప్రత్యేక ప్రోత్సాహం అవసరమని మంత్రి కోరారు. అలాగే, నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ రింగ్ రోడ్ మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌లపై గత ప్రభుత్వాలు ప్రకటనలకేప్రాజెక్ట్లపై గత ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమైపోయాయని, ప్రజా పాలన ప్రభుత్వంలోనే పనులు పురోగమిస్తున్నాయని తెలిపారు. వచ్చే సీజన్లో ప్రతి పల్లెకు గౌరవెల్లి నీళ్లు అందించేలా సీఎం చేస్తున్న కృషిని ప్రశంసించారు.బీఆర్ఎస్ పాలనలో లక్షకోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంకాళేశ్వరం అయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు.హుస్నాబాద్ కు అభివృద్ధి వరాలుఅరవై ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చా. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చా. డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇది. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.విధ్వంస పాలనకు తెరపడింది.. సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి: మంత్రితుమ్మలప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 లక్ష 4 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం.అడబిడలనుఆరీసీబస్సులకు యజమానులను చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గత పాలకులు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్ హుస్నాబాద్ ను ఉపయోగించుకున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదుఐడోంట్ కేర్ మేనేజర్ వేధింపులు భరించలేక ఉద్యోగి ఆత్మహత్యగత పాలకుల్లా మేం హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. గత పదేళ్లలో బీఆరెస్ పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదు. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధి గ్రామాలనుఅభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.