మోహన్ క్రైమ్ రీపోటర్ : మానేటి న్యూస్ హన్మకొండ/
హనుమకొండ/వరంగల్ గత కొద్ది గంటలుగా కురుస్తున్న భారీ వర్షం నగరాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురవడంతో రోడ్లు నీట మునిగిపోయాయి. వర్షపు నీరు రోడ్లమీదకి వచ్చి మొక్కలపైకి కూడా చేరింది. ఫలితంగా ప్రధాన రహదారులు, గల్లీలు అన్ని బ్లాకైపోయాయి.సిటీ లోని హంటర్ రోడ్, కాజీపేట ఫ్లైఓవర్ కింద, ఎన్గోస్ కాలనీ, సుబెదారి, ములుగు రోడ్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల నీరు ఇంజన్లలోకి చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. మోటార్ బైకులు, ఆటోలు, కార్లు రోడ్డుమీదే ఆగిపోవడం వలన భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ప్రజలు రోడ్లపైకి రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు ఉన్నాయి. డ్రైనేజీ లైన్లు పూర్తిగా నిండిపోవడంతో నీరు వెనక్కి ఎగసి వస్తోంది. వర్షపు నీరు నిలిచిపోయి రోడ్లపై పెద్ద గుంటలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.స్థానికులు చెబుతూ — “ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. చిన్న వర్షం పడినా నగరం మునిగిపోతుంది. మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద పరిస్థితుల్లో రోడ్లమీదికి రావొద్దని, తాత్కాలికంగా వాహనాలు నడపకూడదని పోలీసులు, మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. వర్షం ఇంకా కొనసాగుతుండటంతో నగర ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించబడింది.
Leave a Reply