X

స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన  “వందేమాతరం..

మానేటి న్యూస్ కరీంనగర్ నవంబర్ 07

స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం వందేమాతరం….
• నాటి నుంచి నేటి వరకు ప్రజల్లో దేశభక్తిని కలిగించే గేయం వందేమాతరం…
• నేటి నుంచి నవంబరు 26 వరకు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
• బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…



స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి  నేటితో 150 ఏళ్లు పూర్తికానున్నాయని , ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని  బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  తెలిపారు. వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గేయాన్ని నవంబర్ 7, 1875 న బంకించంద్ర సెటర్జీ రచించారన్నారు. ప్రధానంగా ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, భారతీయుల్లో చైతన్యాన్ని తెచ్చిందన్నారు.   వందేమాతరం దేశ  జాతీయ గేయం  అయిందన్నారు.  150వ వార్షిక వేడుకలను బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు . అందులో భాగంగా నేటి నుండి నవంబర్ 26 వరకు జిల్లా లోని  అన్ని మండల్లో   వందేమాతరం గేయాన్ని ఆలపించడానికి  బిజెపి శ్రేణులు తగిన విధంగా కార్యాచరణ  చేపట్టి ప్రోగ్రాం ను సక్సెస్ చేయాలని  సూచించారు.  కేంద్ర ప్రభుత్వం ఏడాది  పొడవునా చేపడుతున్న వందేమాతర కార్యక్రమాలలో బిజెపి సైతం పాలుపంచుకుంటుందని , అదే విధంగా బిజెపి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post