
సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ నవంబర్ 1
సైదాపూర్ మండలము సోమారం, బూడిద పల్లి గ్రామంలో రైతుల వరి పంట పొలాలను బీఎస్పీ పార్టీ పక్షాన పరిశీలించడం జరిగింది. కోతకు వచ్చిన వరి పంట నేలకు ఒరగడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏ రైతును కదిలించిన కన్నీటి చుక్కలు కనబడుతున్న యి. పూర్తిగా వరి కోయ రాకుండా నీరు ఇప్పటికీ ప్రవహించడంతో వడ్లు మొలకైతే పరిస్థితి కనబడుతుంది. ఇట్టి కోయలేని వరి పంటల వల్ల రైతుకు ఎకరానికి 50వేల వరకు పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొక్కజొన్న పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను యుద్ధ ప్రాతిపదికగా తక్షణ పరిహారం క్రింద వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, పూర్తిగా నష్టపోయిన రైతులకు యాసంగి పంటకు సంబంధించి ఉచిత ఎరువులు ఉచిత వరి మొక్కజొన్న విత్తనాలు అందియాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. రైతులను ఆదుకోకపోతే తీవ్ర ఆందోళనలు బీఎస్పీ పార్టీ పక్షాన చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. బిఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, సైదాపూర్ పార్టీ మండల అధ్యక్షులు జేరిపోతుల రాజు జిల్లా నాయకులు డేగల వెంకటేష్, ఎలగందుల శంకర్, జేరిపోతుల రవీందర్, నియోజకవర్గ నాయకులు వెలుపుల రాజు,బోయిని బాబు, హనుమంతు, దుండ్ర రాంబాబు, రైతులు కంది ఆంజనేయులు, దినుగుల తిరుపతి గౌడ్, గడ్డంరాజయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.