X

సే నో టూ డ్రగ్స్…. సే ఎస్ తో లైఫ్..మాదకద్రవ్య రహిత భారతదేశం కావాలి…

హుస్నాబాద్, నవంబర్ 18, ( మానేటి న్యూస్ )

హుస్నాబాద్ పట్టణంలో నషా ముక్త భారత్ అనే కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి పురపాలక సంఘ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సే నో టూ డ్రగ్స్ – సే ఎస్ తో లైఫ్. అనే స్లొగన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.మున్సిపల్ కమీషనర్  మాట్లడుతూ   యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, పెద్ద సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో పాల్గొనడం చాలా అవసరం అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ నుండి CI శ్రీనివాస్ ,SI లక్ష్మా రెడ్డి , సింగిల్ విండో చైర్ పర్సన్ బొలిశెట్టి శివయ్య , మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న , మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు పున్న.సది ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ అధికారులు, సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post