
ప్రశాంతంగా దేవుడిని దర్శించుకునేందుకే భక్తులు దూర ప్రాంతాల నుండి దేవాలయాలను సందర్శిస్తుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబసభ్యులతో దైవదర్శనాలకు వెళుతుంటారని అధికారుల పుణ్యమా అని తనివితీరా దేవుడిని దర్శించుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి వస్తోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని తీసుకున్నా ఆర్జిత సేవల టిక్కెట్లు రేట్లు షాక్ కొట్టేలా ఉన్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంలో టిక్కెట్ ధరలు ఉన్నాయి..దూరం నుంచే దేవుడిని దర్శించుకుని తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. భక్తుల నుంచి వీలైనంత త్వరగా రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.తప్ప భక్తుల భద్రత తావులేకుండా పోయింది. ప్రధాన దేవాలయాల్లో దర్శనం టిక్కెట్ల ధరలు రోజురోజుకూ పెంచేస్తున్నారు. రేట్లు పెంచి సామాన్య ప్రజలకు దేవుడి ని దూరం చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ళ శ్రీనివాస్ అన్నారు.