మానేటి న్యూస్ కరీంనగర్ ప్రతినిధి 07/
కరీంనగర్ జిల్లా
టీబీ, డ్రగ్స్ రహిత కరీంనగర్ గా తీర్చిదిద్దడానికి మిషన్ మోడ్ లో పనిచేయాలి..
కరీంనగర్లో కవులు, కళాకారులు, విద్యావేత్తలకు కొదవలేదు..
సామాజిక రుగ్మతలపై నివారణకు
సమర శంఖం పూరించాలి..
మేధావులు విద్యావంతులు సమాజానికి జ్ఞానాన్ని పంచాలి..
ఇంటికే పరిమితం కావద్దు..
మనదేశంలోనే అత్యధికంగా
యువత ఉన్నారు..
భవిష్యత్తు భావితరానిదే..
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో గవర్నర్ ముఖాముఖి
జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
గవర్నర్ ను ఆకట్టుకున్న
పవర్ ప్రజెంటేషన్..
కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు
తెలిపిన గవర్నర్..
కరీంనగర్ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. కరీంనగర్ ను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటన పర్యటనలో భాగంగా గవర్నర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు.
జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య , జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టిబి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ , గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛభారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం మహాలక్ష్మి పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాలపై లెక్కలతో సహా వివరించారు. జిల్లాలో 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తూ మహిళలు పిల్లల పోషణ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ ఒక వేదికగా నిలుస్తోందని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు అధికారులకు ప్రభుత్వ సిబ్బందికి సైన్ లాంగ్వేజి లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో గవర్నర్ మంత్రముగ్ధులై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతినీ గవర్నర్ అభినందించారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, టి బి వ్యాధి నివారణ కోసము ప్రతి ఒక్కరు బాద్యత తీసుకోవాలనీ, టిబి రాకుండా జాగ్రత్త పడాలనీ, టిబి వ్యాధి నివారణ కోసము చాల రకాల మందులు వచ్చాయన్నారు. కవులు, రచయితలు, ప్రజా ప్రతినిధులు అందరిని టీబీ నియంత్రణలో బాగస్వామ్యం చేయాలన్నారు. సబ్ కా వికాస్- సబ్ కా ప్రయాస్, టి బి నిర్మూలనలో అందరు కష్ట పడితేనే అందరు ఆరోగ్యంగా ఉంటారనీ, జిల్లాను రోల్ మాడల్ గా తీర్చిదిద్దాలని , అందరికి టిబి లక్షణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. దీంతో త్వరగా టిబిని నిర్మూలించవచ్చాన్నారు. టి బి ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరు బాద్యతగా వ్యవహరించాలన్నారు. టిబి నిర్మూలనలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని తెలిపారు.
జిల్లాలో కవులు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కరీంనగర్ ను డ్రగ్స్ రహిత జిల్లాగా అధికారులు ప్రజలు కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు.
ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి కృషి చేయాలన్నారు.
• మేధావులు విద్యావంతులు జ్ఞానాన్ని సమాజానికి పంచాలి..
జిల్లాలో ఉన్న మేధావులు విద్యావంతులు ఇంటికి పరిమితం కాకుండా జ్ఞానాన్ని సమాజానికి పంచాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలోనే యువత ఉందని రాబోయే రోజుల్లో భవిష్యత్తు భావితరానిదేనని స్పష్టం చేశారు. దీంతోపాటు సమాజంలో నాటుకున్న సామాజిక రుగ్మతలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా వరకట్న సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ, శ్రమ దోపిడిని పూర్తిగా నిరోధించాలన్నారు. సామాజిక రుగ్మతలు రూపుమాపితినే భారత్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. దృఢమైన భారత్ ను నిర్మించడానికి అందరూ కలిసికట్టుగా నడుంబించాలని పిలుపునిచ్చారు.
• సమాజ అభివృద్ధికి అందరు పాటుపడాలి..
సమాజ అభివృద్ధికి అందరు పాటుపడాలని కేవలం అధికారుల తోనే కాకుండా ప్రజలందరి సమిష్టి కృషితో సమాజం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. కరీంనగర్లో కవులు, కళాకారులకు విద్యావేత్తలకు కొదవ లేదన్నారు. వారి సేవలను జిల్లా అధికారులు ఉపయోగించుకోవాలన్నారు. సమాజంలో సమస్యల పరిష్కారానికి సమర శంఖం పూరించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐ. టి లే కాకుండా మనవీయా కోణంతో పని చేయాలి అని అన్నారు. వందేమాతరం గీతం జాతిని ఉర్రూతలు ఊగించిందని తెలిపారు. నేటితో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవడం దేశం గర్వించదగ్గ విషయం అన్నారు.
బకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ వందేమాతరం గీతం ప్రజలకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని తెలిపారు. తెలంగాణ ఘనమైన వారసత్వ సంపదతో సంస్కృతికి సంప్రదాయాలతో వెలసిల్లుతున్నదని పేర్కొన్నారు. భారత్ ను అజయ శక్తిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు ప్రముఖ వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. ప్రముఖులు వారు చేస్తున్న సామాజిక సేవలు వివిధ కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ గుర్తింపును జిల్లా కలెక్టర్ యంత్రాంగం మరింత ముందుకు తీసుకుపోవడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.