మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 31/
స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ్ పరిషత్ తెలంగాణ ప్రాంత శ్రద్ధా జాగరణ ప్రముఖ్ పరుశరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ,సర్దార్ పటేల్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే మన దేశ ఐక్యతకు పునాది. ఆయన చేపట్టిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 13న ప్రారంభమై 17న విజయవంతంగా ముగిసింది. దాంతోనే మన తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం లభించింది,అని పరుశరామ్ పేర్కొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో బోయిని పురుషోత్తం దీపప్రజ్వలన చేయగా, పాఠశాల ప్రధానాచార్య సముద్రాల రాజమౌళి పటేల్ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకలో పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. చక్రవర్తుల రమణాచారి, డా. నాళ్ల సత్య విద్యా సాగర్, గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, రాపర్తి శ్రీనివాస్, గోలి పూర్ణచందర్, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, నడిపెల్లి దీన్‌దయాల్, అప్పిడి వకుళాదేవి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.