భీమదేవరపల్లి అక్టోబర్ 30( మానేటి న్యూస్):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన దంపతులు బుధవారం రోజు సాయంత్రం ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో గల్లంతైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు భీమదేవరపల్లికి చెందిన ఈసం పెల్లి ప్రణయ్ కల్పన దంపతులు బుధవారం అక్కన్నపేటకు వెళ్తుండగా మల్లారం వెళ్లే దారి భారీ వర్షాలతో దెబ్బతినడంతో వేరే దారి మోత్కులపల్లి వాగు మార్గంలో వెళ్లారు.వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బండితోపాటు కొట్టుకుపోయారు. గురువారం ఉదయం రైతులు పొలాల వద్దకు వెళ్ళినప్పుడు చెరువు వద్ద టూ వీలర్ కనిపించడంతో బండి నెంబర్ ద్వారా దంపతులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వాగు,చెరువు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో భీమదేవరపల్లి లో విషాదం నెలకొంది.