X

వాకర్స్ అసోసియేషన్ పోలీస్ శాఖ రాయికల్ ఆధ్వర్యంలో త్రీ కె(3k) రన్..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/
భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి ఉప ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ శాఖ మరియు రాయికల్ పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శుక్రవారం ఉదయం ఆరు గంటలకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది.
శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ చౌక్ ఓల్డ్ బస్టాండ్ నుండి తిరిగి శివాజీ విగ్రహం వరకు త్రీ కే రన్ నిర్వహించడం జరిగింది అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలతో సాగిన ఈ ర్యాలీ రాయికల్ పట్టణ ప్రజలను ఉత్తేజితలను చేసింది దీనిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశభక్తిని మరియు పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు దీనిలో రాయికల్ ఏఎస్ఐ దేవేందర్ మరియు పోలీసులు తిరుపతి క్రాంతి కుమార్ అశోక్ గౌడ్ మరియు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగుని భూమా గౌడ్ ప్రధాన కార్యదర్శి పొన్నం రమేష్ అసోసియేషన్ సభ్యులు ముక్కెర శేఖర్ ఇల్లెందుల శ్రీనివాస్ వేణు రవీందర్ సత్యనారాయణ రత్నాకర్ రమేష్ కౌన్సిలర్లు శ్రీధర్ మహేష్ దాదాపుగా 40 కి పైగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post