లైంగిక వేధింపుల్లో హెచ్ఎం, సిబ్బంది పాత్రపై విచారణ కొనసాగుతోంది..

అవసమైతే వారిపైనా పోక్సో కేసు నమోదు చేయాలి ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నారు..

• ప్రాథమిక విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు..

•పిల్లల భవిష్యత్తుతో ముడి పడి ఉన్న సమస్య..

•దయచేసి మీడియా సంయమనం పాటించాలి..

ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. వంగరలో గురుకుల విద్యార్ధి ఆత్మహత్య దారుణం బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది..

ఇకనైనా గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలి తెలుగు రాష్ట్రాలపై భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధం కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడిమానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 28కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గత 5 రోజుల నుండే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియ్యలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఈరోజు హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేశారన్నారు. ఒకవేళ లైంగిక వేధింపుల విషయంలో హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు. ఒకవేళ వారి పాత్ర కూడా ఉన్నట్లు తేలితే వారిపై పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనుకాడొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు. ఈరోజు కరీంనగర్ లో ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ‘‘నిన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన ఘటన దారుణం. ఇది పోక్సో కేసు. పిల్లల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య. దీనిని ప్రచారం చేయడంవల్ల వాళ్ల జీవితాలు ప్రమాదంలో పడతాయి. దయచేసి మీడియా సంయమనంతో వ్యవహరించాలి’’అని అభ్యర్ధించారు. ‘‘ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ గత 5 రోజుల నుండి లోతైన విచారణ జరిపించారు. నివేదిక తెప్పించారు. నిందితుడికి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో హెడ్మాస్టర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. వారి పాత్ర ఉంటే వాళ్లపైనా పోక్సో కేసు పెట్టేందుకు వెనుకాడవద్దని అధికారులకు చెప్పాను. పిల్లలకు భరోసా ఇవ్వడంతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన పడకుండా ధైర్యం కల్పించాలని కోరిన. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.’’అని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వంగర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘వంగర గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య దారుణం. నిర్బంద విద్య కోసం ఇబ్బంది పెట్టకుండా విద్యార్థుల మానసిక పరిస్థితిని తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. దురద్రుష్టమేమింటే ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనూ గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలోనూ ఆత్మహత్యల పరంపర కొనసాగింది. నెలల తరబడి విద్యార్థులు ఆందోళన పట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందేమోనని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పాలనలోనూ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. గురుకులాల, హాస్టళ్ల దుస్థితి మారలేదు. ఒక ఘటన జరిగితే అది మళ్లీ పునరావ్రుతం కాకుండా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ప్రభుత్వం గురుకులాలను, హాస్టళ్లను గాలికి వదిలేయడంవల్లే ఈ దుస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వంపై గురుకులాలు, హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.’’అని వివరించారు.భారీ వర్షాల నేపథ్యంలో….మొంథా తుఫాను ప్రభావంవల్ల తెలుగు రాష్ట్రాలకు నేడు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంలను అలర్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ లోని 19 జిల్లాల్లో వర్ష ప్రభావం భారీగా ఉన్నందున ఆ రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బ్రందాలను ఇప్పటికే పంపించాం. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. అవసరమైతే అదనపు టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నాం. తెలంగాణలోనూ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రాణ నష్టం లేకుండా చూడాలి. కేంద్రం పక్షాన అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నాం.’’అని పేర్కొన్నారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *