X

రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..


కాజిపేట్ మానేటి న్యూస్ నవంబర్ 19


రైల్వే యూనిట్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలి..

స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తాం..

భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి..

యూనిట్ లో వివిధ సర్వీస్ లలో స్థానికులకే ఉద్యోగ అవకశాలు కల్పించాలి..

గతంలోను కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరను..

భూ బాధితులకు, స్థానికులకు ఉద్యోగాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తా..

మార్చి నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనులు ప్రారంభం..

ఏడాదికి 600 కోచ్ లు ఇక్కడ తయారవుతాయి..

౼వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య..


కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు.తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో జరుగుతున్న పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, విభాగాల వారీగా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలపై రైల్వే అధికారులతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమీక్షించ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య.మాట్లాడుతూ,  కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ 30 ఏళ్ల కల నెరవేరబోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలొనే ఇది సాధ్యమైందని, ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. భూ బాధితులతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కోరనని వెల్లడించారు. రైల్వే యూనిట్ లో స్థానికుల ఉద్యోగాలు కల్పించే అంశంపై పార్లమెంట్ లో సైతం తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మార్చి నెలలో ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి ఏడాది 600 ల కోచ్ లను ఇక్కడ సిద్ధం చేస్తారని పేర్కొన్నారు. ఏక్కడ పనులు జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు. అనంతరం రైల్వే అధికారులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నమూనా వివరాలను ఎంపీకి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో CME ఆనంద్, GGM మురళీకృష్ణ,DGM శర్మ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post