హుస్నాబాద్, అక్టోబర్ 29, ( మానేటి న్యూస్ ):




హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఈరోజు బుధవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ పరిస్థితి చాలా దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. రైతులు కష్టపడి పండించిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు లబోదిబోమని ఏడుస్తున్నారు. మమ్ములను ఆదుకునే నాధుడే లేడా అని వారి బాధను వెళ్లబుచ్చుకున్నారు. రైతుల వడ్లు వరుదకు కొట్టుకపోవుతున్న దృశ్యం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అస్తవ్యస్తంగా మార్కెట్ ప్లాట్ ఫామ్ లు సరిగా లేకపోవడంతో పండించిన పంట నేల పాలు అవుతుంది. స్థానిక మంత్రి మరియు మార్కెట్ పాలకవర్గం రైతులను పట్టించుకోని రైతులకు సరియైన ప్లాట్‌ఫార్ములు ఏర్పాటు చేయాలి అని రైతులు కోరుతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన పంట చేతికి అందినంటే అంది నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం మాకు అండగా నిలబడి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం.