X

రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్..

అక్కన్నపేట,అక్టోబర్ 30,( మానేటి న్యూస్):

అక్కన్నపేట మండల కేంద్రం పంతులు తండా గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ర్టప్రభుత్వం మరియు స్థానిక మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు పక్రియ వేగవంతం చేయాలని బేషరతుగా మద్దతు ధరతో కోనాలని బిజేపి గిరిజన మోర్చా అక్కన్నపేట మండల అధ్యక్షుడు రైనా నాయక్ డిమాండ్ చేశారు,”మొంథా తుఫాను ప్రభావంతో పడిన భారీ వర్షం రైతుల పాలిట శాపంగా మారిందని చేతికి వచ్చిన పంట తడిసి ముద్దయింది దింతో అన్న దాత దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిదంని బిజేపి గిరిజన మోర్చా అక్కన్నపేట మండల అధ్యక్షుడు రైనా నాయక్ ఆరోపించారు, గురువారం రోజున అక్కన్నపేట మండల కేంద్రంలోని పంతులు తండా ఐకేపి సెంటర్ ని సందర్శంచిన అనంతరం మాట్లాడుతూ ఆరబోసిన వరి ధాన్యం కుప్పలుగా పోసిన కూడా భారీ వర్షం దాటికి కుప్పల కింద నుండి వరద నిళ్లు వెళ్లి వడ్లు మొత్తం తడిసిపోయాయని సరియైన టార్పలిన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నిళ్లపాలు చేసినట్లయిందని రైతులు విలపిస్తున్నారు ఐకేపి సెంటర్ లో సరైనా వసతి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైనా నాయక్ అన్నారు..ఇప్పటికైనా రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున రైతులకు సరిపడా టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని తడిసినా ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వ మే కోనుగోలు చేసే విధంగా చర్యలు తిసుకోవాలని రైనా నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రైతులు మరియు బిజేపి నాయకులు లావుడ్య అమీనా, లావుడ్య సంతోష్,లావుడ్య కిరణ్, మరియు తదితరులు పాల్లొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post