కాజిపేట్ మానేటి న్యూస్ రమేష్ అక్టోబర్ 28/

గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధిగా ఖాజిపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చింతగట్టు రాజు గౌడ్ ను నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ చేతుల మీదుగా నీయామక పత్రం అందజేసినట్లు తెలిపారు. గీత కార్మికుల సమస్యల కోసం గత కొన్నేళ్లుగా రాజు గౌడ్ చేస్తున్న కృషి ని గుర్తించి నియమించడం జరిగిందన్నారు. సంఘ నియమ, నిబంధనల ప్రకారం గీత కార్మికుల హక్కుల రక్షణ కోసం ఆర్ధిక, రాజకీయ,సామాజిక,విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందేలా రాజు గౌడ్ కృషి చేయాలని రమేష్ గౌడ్ తెలిపారు. తనను మోకుదెబ్బ అధికార. ప్రతినిధిగా నియమించిన జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ కు, తన ఎన్నికకు సహకరించిన పశ్చిమడ్ల స్వామి గౌడ్ కు రాజు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
Leave a Reply