
ధర్మసాగర్ మానేటి న్యూస్ నవంబర్ 1
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాల కారణంగా జఫర్గడ్డ శంకర్ తండ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వాగు దాటే ప్రయత్నంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన బక్క శ్రావ్య దురదృష్టవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది.
ఈ ఘటనపై బాధ వ్యక్తం చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు*.నేడు ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బక్క శ్రావ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ఆర్థిక, నైతికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం కోనారెడ్డి పేట చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా నాయకులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు చెరువు అలుగు ప్రాంతాన్ని పరిశీలించారు..
ఈ సందర్భంగా వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, సీనియర్ నాయకులు చోటు వలి,పోశాల వెంకన్న,అక్బర్, గ్యాదరీ భాస్కర్, యూత్ నాయకుడు కుల్లా యాకాంతం,రాజు, మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.