X

మైనారిటీ గురుకులాల్లో దోబీల బకాయిలు తక్షణమే చెల్లించాలి గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్..

మానేటి న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 30/

రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న దోబీలకు సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు.హుజుర్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం అధ్యక్షతన గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత ఏడాది నుండి మైనారిటీ గురుకుల హాస్టళ్లలో ఉతికిన బట్టల బిల్లులు రాకపోవడంతో వృత్తిదారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కనీసం రూ.2 కోట్లు విడుదల చేసి వృత్తిదారులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మైనారిటీ గురుకుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.సమావేశంలో జిల్లా యువజన అధ్యక్షుడు ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోమర్రాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post