సాగర్ మానేటి న్యూస్ పరకాల/
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మామ, స్వర్గీయ కేంద్ర మంత్రివర్యులు శ్రీ సూదిని జైపాల్ రెడ్డి సహోదరుడు శ్రీ సూదిని మనోహర్ రెడ్డి ని ఈ రోజు హనుమకొండ సర్క్యూట్ హౌజ్ సమీపంలోని అపార్ట్మెంట్‌లో ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వ్యక్తిగత బంధువుల వివాహ కార్యక్రమానికి విచ్చేసిన సమయంలో శాలువా కప్పి ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,
ఎస్సీ వర్గీకరణ సాధనలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పోరాటం చారిత్రకమని, ఎన్నో ఏళ్లుగా ఎస్సీ ఉపకులాల సమైక్యత కోసం ఆయన చేసిన కృషి ఫలితమే నేటి విజయమని పేర్కొన్నారు. దళిత రచయిత అందెశ్రీ ఎల్లన్న మరణదినాన ముఖ్యమంత్రి స్వయంగా భౌతిక దేహాన్ని మోసి గౌరవం తెలియజేయడం దళితుల పట్ల ఆయన చూపుతున్న అనురాగానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇలాంటి గౌరవం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదని నాయకులు ప్రశంసించారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి కృషి చేసి, ముఖ్యమంత్రి కి పేరు తీసుకువచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
తరువాత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకల్లో ప్రధాన అతిథిగా పాల్గొన్న మనోహర్ రెడ్డి కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
ఎం.హెచ్.డీ.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాదిగ,
దండోరా రాష్ట్ర నాయకులు రోజా రాణి,
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ,
ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఆర్గనైజర్ ఆరూరి సాంబయ్య,
జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ మహేందర్,
ఉమ్మడి పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,
ఆత్మకూరు, గీసుకొండ, దామెర మండల అధ్యక్షులు సిలువేరు బిక్షపతి, గొర్రెరాజు, గోవిందు ప్రేమ్‌కుమార్, జుంటి,
వివిధ జిల్లాల దండోరా మరియు ఎస్సీ విభాగం నాయకులు పాల్గొన్నారు.