సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30
మనముదిరాజ్,బిడ్డమహాసభతెలంగాణసైదాపూర్ మండలాధ్యక్షుడిగా నెల్లి శ్రీనివాస్,నియామకమయ్యారు.ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు సిద్ధి సంపత్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ సంయుక్తంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజులను చైతన్యం చేస్తూ వారి అభ్యున్నతికి, సమాజికాభివృద్ధికి, విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ. సాంస్కృతిక రంగాలలో వారి పురోగాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.