
• గోడలకు పోస్టర్లను అంటించి అవగాహన వీపీవో ల కార్యక్రమలు..
మానేటి న్యూస్ ప్రతినిధి చిగురుమామిడి 12 నవంబర్/
చిగురుమామిడి: మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా సమిష్టి కృషితో ముందుకు వెళ్దామని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ అనసూయ,రూప దేవిలు పిలుపునిచ్చారు.పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని సుందరగిరి గ్రామంలో ఆ గ్రామ విలేజ్ పోలీస్ ఆఫీసర్ లు అనసూయ,రూప దేవిలు మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించి మన ఊరు,మన బాధ్యత అనే పోస్టర్లను గోడలకు అతికిస్తూ ప్రజలకు,ప్రయాణికులకు, యువతకు అవగాహన కల్పించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించిన, విక్రయించిన,రవాణా చేసిన సాగుచేసిన,ఆన్లైన్ బెట్టింగులు ఆడిన,ఆడించిన చట్టరీత్యా నేరమని ప్రజలకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వీటి నుండి కాపాడుకోవాలని కోరారు.యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు తెలిపారు.మత్తు పదార్థాలకు లోను కాకుండా ఉండే అందుకే ముందస్తుగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.
