
మానేటి న్యూస్ నవంబర్ 18 తిమ్మాపూర్ ప్రతినిధి/
15 వేల ఆర్థిక సాయం చేసిన తుమ్మనపల్లి..
తిమ్మాపుర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి విద్యసాగర్ లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు.గత నెలలో లారీపై నుంచి పడిపోవడంతో నడుము వెన్నుపూస విరిగి, తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు 10 లక్షల దాకా అప్పు చేశారు. వెన్నుపూస విరగడంతో అతడు మంచానికే పరిమితం అయ్యాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నుస్తులాపూర్ మాజీ సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు విద్యాసాగర్ ఇంటికి వెళ్లి 15 వేల ఆర్థిక సాయం చేశారు. ఆపదలో ఉన్న తమ కుటుంబానికి సహాయం అందజేసిన తుమ్మనపల్లి శ్రీనివాస్ గారికి కుటుంబ సభ్యులు, విద్యాసాగర్ తమ్ముడు, మామిడి అనిల్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మామిడి విద్యా సాగర్ కు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ఎవరైనా తమ వంతు సహాయం అందించాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నది.