భీమదేవరపల్లి నవంబర్ 18(మానేటి న్యూస్)
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీఅని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సిపిఐ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.బస్సు ప్రచార జాతలో భాగంగా ముల్కనూర్ లోని ఎల్లమ్మ దేవాలయం నుండి బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్దకు కమ్యూనిస్టు కళాబృందాలు సిపిఐ కార్యకర్తలు,ప్రజలు డప్పు చప్పులతో కళాబృందాల ఆటపాటలతో చేరుకోవడం జరిగింది.ఈ సందర్బంగా
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయస్థాయిలో ముగింపు ఉత్సవాలను ఖమ్మంలో జరుపుకో బోతున్నామని కొమురం భీం సమాధి అయినటువంటి
జోడేఘాట్ నుండి ప్రారంభమైన బస్ జాతా భద్రాచలం ఖమ్మం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.100 సంవత్సరాల పాటు నిస్వార్ధంగా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడి పార్టీ ఒక భారత కమ్యూనిస్టు పార్టీనే, చాలావరకు ఈ వంద సంవత్సరాల లో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి కనుమరుగైపోయాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం కుర్చీల కోసం కొట్లాడే పార్టీలని కేవలం పేద ప్రజల కోసం కొట్లాడే పార్టీ పేద వారికి భూమి కోసం కొట్లాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని,మన దేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటికీ మనదేశంలో ఆరు కోట్ల మంది చిన్న పిల్లలు, బాల కార్మికులుగా ఉన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ప్రైవేట్ విద్యను ప్రోత్సహించకుండా ఉండాలని ప్రైవేట్ స్కూలు కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయని,విద్య ఒక వ్యాపారం అయిపోయిందని ఈ దేశంలో పుట్టిన పేదవాడికి సమానంగా ప్రభుత్వ విద్య అందించాలని కొట్లాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ,నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కొట్లాడిన పార్టీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కొట్లాడే పార్టీ ఎర్రజెండా పార్టీ అని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ స్వాతంత్రం కావాలని కొట్లాడి నటువంటి మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ పరాయి పాలన వద్దు స్వపరిపాలనే ముద్దని ఆనాడు కొట్లాడిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు సిపిఐ కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేరని ఎద్దేవా చేస్తున్నాయని ఇప్పటివరకు దేశంలో కమ్యూనిస్టులు పరిపాలించి నటువంటి కేరళ రాష్ట్రం పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రమని అక్కడ ప్రజలకి ఇండ్లు మరియు విద్య వైద్యాన్ని అందించి పేదరికం లేకుండా చేశామని దేశంలో పేదరికం లేని ఒకే ఒక్క రాష్ట్రం కేరళ దాని పరిపాలన చేసింది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని ఇన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తున్న పార్టీలు పేదరికం లేకుండా ఒక్క రాష్ట్రాన్ని చేయలేక పోయాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇందుర్తి హుస్నాబాద్ ను సాగునీరు కోసం గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ల కోసం శంకుస్థాపన చేసి కొట్లాడం జరిగిందని తదనంతరం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా 16 సంవత్సరాలనుండి సాగునీటిని అందించలేకపోయాయని పేర్కొన్నారు. సాగునీరు తాగునీరు రైతులకు గిట్టుబాటు ధర కార్మికులకు వేతనాల గూర్చి నిరుపేదలకు ఇండ్ల స్థలాల గూర్చి పోరాటం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కలవేన శంకర్,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మారుపాక అనిల్ కుమార్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, ఆదరి శ్రీనివాస్,నేదునూరి జ్యోతి,కరుణాకర్,తోట బిక్షపతి, మద్దె ఎల్లేష్, సదాలక్ష్మి, ఉట్కురి రాములు, సంతోష్,లక్ష్మణ్, ఆదిరి రమేష్, మంచాల రమ,బోడ బాలరాజు, రావుల తిరుపతి, సుంచు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.