ధర్మసాగర్ మానేటి న్యూస్ డిసెంబర్ 2
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ రాంపూర్ మున్సిపల్ డంపింగ్ యాడ్ సమీపంలో నూతనంగా బయో మైనింగ్ ప్రాజెక్టును మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి నేడు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.
మడికొండ డంపింగ్ యార్డు అంశంపై తాను అసెంబ్లీలో ప్రసంగించానని, హైదరాబాద్ నగరం నుండి ఓరుగల్లుకు వస్తుంటే ముఖద్వారం మడికొండ అని, డంపింగ్ యార్డ్ తో చాలాసార్లు ఫాగ్ మాత్రమే కనిపించేదని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అనేకమార్లు ధర్నాలు చేశారని, తనకు వినతి పత్రాలు అందజేశారని, బయో మైనింగ్ మిషన్ల ద్వారా చెత్త నియంత్రణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు.
త్వరలోనే మడికొండ డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుందని, ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డంపింగ్ యార్డ్ సమస్యపై సీఎం మాట్లాడారని, డంపింగ్ యార్డ్ వల్ల ఫామ్ అయ్యే ఫాగ్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని, డంపింగ్ యార్డ్ సమస్య గుది బండగా మారిందని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, మామునూరు ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ స్కూల్, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఓరుగల్లులో జరుగుతున్నాయని, ఓరుగల్లు ప్రజలు ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి 1/3 నిధులు కేటాయించాలని, విలీన గ్రామాలు వేగంగా ఎక్స్పాండ్ అవుతూ అభివృద్ధి చెందుతున్నాయని, విలీన గ్రామాల నుండి అధికంగా రెవెన్యూ, క్యాంపు డ్యూటీ మున్సిపల్ కార్పొరేషన్ కు వస్తుందని, వెళ్లిన గ్రామాల అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఊరుకోనని, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి బాధితులకు అండగా నిలిచారని, ఇండ్లలోకి నీరు చేరిన వారికి 15 వేల రూపాయలు, రేషన్ అందించామని, మేము నాయకులుగా కాదు ప్రజా సేవకులుగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ హైడ్రా మాదిరిగానే వరంగల్లో వైడ్రా తీసుకువస్తే ఆక్రమణకు గురైన చెరువులు, నాళాలు తొలగిపోయి వరంగల్ నగరం సేఫ్ గా ఉంటుందని, వైడ్రా తీసుకురావాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. హైడ్రాపై కొంతమంది నేతలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మలేదని, అసత్య ప్రచారాలు చేసే వారి చెంప చెల్లుమనిపించారని, BRS పార్టీ అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కేఆర్ దిలీప్ రాజ్, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ శ్రీ పైడిపాల రఘు చందర్, మండల పార్టీ అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు, నాయకులు, కార్యకర్తలు మడికొండ గ్రామస్తులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.