X

ఫీజు బకాయిలు చెల్లించాలని 4న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ..

సైదాపూర్ మానేటి న్యూస్ రిపోర్టర్ వైష్ణవ్ అక్టోబర్ 30/

హైదరాబాద్ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం బర్కత్ పుర లో కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆంక్షలు కోతలు విధించడం సరికాదని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల జితాలలో, అధికారుల జీతాలలో కోతలు, ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం రూ.1.40లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, రూ.3లక్షల కోట్లు పన్నుల రూపేనా ఆదాయం వచ్చిందని, దాదాపు రూ.6లక్షల కోట్లు ఆదాయం వచ్చినా అన్నింటికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ.. ఫీజుల బకాయిలు విడుదలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను వేలం వెయ్యద్దని, ఆ భూముల్లో సంక్షేమ హాస్టల్స్, గురుకుల భవనాలను, ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ పట్ల చూపిస్తున్న శ్రద్దను విద్యార్థుల ఉజ్వల భవిష్యత్పై ప్రభుత్వం చూపడం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు రాహుల్, నవీన్, విజయ్, అజయ్, అర్జున్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post