
హైదరాబాద్, నవంబర్ 7, గురువారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన బంద్పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల బలిపీఠం కాని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. విడతల వారీగా ఇస్తామని చేపిన వినకుండా బంద్ పేరుతో కాలేజీ యాజమాన్యలు నాటకాలు చేస్తున్నాయని మండిపడ్డారు
ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో బ్లాక్మెయిల్ రాజకీయాలు సరికాదని సీఎం హెచ్చరించారు. “విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోంది. ప్రజల పిల్లల భవిష్యత్తును ఎవరూ ప్రమాదంలోకి నెట్టకూడదు,” అని అన్నారు. బంద్ చేస్తూ ఎం సాధిస్తారని వారి వెనక ఏ రాజకీయ పార్టీ ఉందొ మాకు తెలియంది కాదన్నారు
• రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ –
విద్యార్థులు నష్టపోతే సహించము. విద్యా వ్యవస్థ మార్పు అంటే కుదరదు. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే చర్యలకు ప్రభుత్వం సహించదు చేయదు,” అని స్పష్టం చేశారు.