మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆ పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు లేక కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.దీనిపై సంబంధిత అధికారులు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు.