
మానేటి న్యూస్ జగిత్యాల నవంబర్ 19
రాయికల్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వరంగల్ రీజియన్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ బెజ్జారపు రవీందర్ కెరీర్ గైడెన్స్ గురించి వివరించడం జరిగింది. పదవ తరగతి నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉంటే మంచి విద్య మరియు ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఐటిఐ, పాలిటెక్నిక్ ,త్రిబుల్ ఐటీ లాంటి విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా పదవ తరగతి నుంచి మొదలవుతాయని తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సోషల్ పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉండడం ద్వారా ప్రవేశ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులకు తమ భవిష్యత్తు పదవ తరగతి నుండి మొదలవుతుందని మరియు తమ లక్ష్యాలకు అనుగుణంగా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ బెజ్జారపు రవీందర్ ఇదే పాఠశాలలో చదివి ఉపాధ్యాయ వృత్తి నుండి గ్రూప్-1 ఉద్యోగం సాధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ పదవులు చేపట్టి ప్రస్తుతం వరంగల్ రీజియన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా ఉండడం చాలా గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొన్నం రమేష్ , రవీందర్ ,మల్లేశం, సత్యనారాయణ, అలీ రాజా, గంగాధర్, శివానందం, పారిపెల్లి గంగాధర్, శ్రీకాంత్, రాము, వనిత, తిరుమల తదితరులు పాల్గొన్నారు.