X

ప్రజల గోడు పట్టని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం.ఎర్రజెండాలు ఎకం కావాలి.సిపిఐ 100 ఎడ్ల బస్సు యాత్రలో సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి..


హుస్నాబాద్,నవంబర్ 18, (మానేటి న్యూస్ )
పెట్టుబడి దారులకు దోచి పెడుతున్నా మోడీ ప్రభుత్వం.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు ధ్వజం.
దేశ సంపద నంత
బడా వ్యాపారులకు కట్టబెట్టి భారతదేశ ప్రజలపై పన్నుల భారం మోఫి  అదాని,అంబానీ కార్పోరేట్ కంపెనీల పెట్టుబడి దారులకు దోచి పెడుతున్నారని బిజెపి ప్రభుత్వ పనితీరుపై చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.
సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ
ఈ నెల 15న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో ప్రారంభమైన సిపిఐ 100 ఎడ్ల సందర్భంగా 3 బస్ జాతల ద్వారా
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల,పెద్దపెల్లి, జగిత్యాల,రాజన్నా సిరిసిల్ల, కరీంనగర్, తిరుగుతు మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు బస్ యాత్ర వచ్చిన సందర్భంగా  మల్లే చెట్టు చౌరస్తా మీదుగా సాగిన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాలో  పలికారు.అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ
భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని బ్రిటిష్ వారి నుండి మన దేశం విముక్తి కొరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నందుకే ఆనాడు సిపిఐ పార్టీని నిషేధం విధించారని అయినప్పటికీ కాన్పూర్, మీరట్, పెషావర్ అనేక కుట్ర కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించిన అధికారం పదవులు ఉన్న లేకున్నా ప్రజల కోసం  అలుపేరుగని పోరాటాలు చేస్తున్నాపార్టీ సిపిఐ ఒక్కటేనని బిజెపి ప్రభుత్వం మావోయిస్టు నాయకులపై కక్షపూరితంగా వ్వవహరిస్తు ఆపరేషన్ ఖగార్ పేరుతో అడవులను జిల్లేడ పడుతు  మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి
ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టు నేతలను బుటకపు ఎన్కౌంటర్ చేసి చంపడం బిజెపి ప్రభుత్వానికి తగదని
చాడ వెంకటరెడ్డి అన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ 2014లో బిజెపి ప్రభుత్వ ప్రతి కుటుంబానికి 15 లక్షాలు ఇస్తామని రైతుల ఆదాయం రెట్టింపు చెస్తామని ధరలు తగ్గించి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువులపై అధిక ధరలను పెంచి  ప్రభుత్వం రంగం సంస్థలైన ఎల్ఐసి బ్యాంకులు టెలికాం గనులు చివరికి రక్షణా రంగం పరిశ్రమలను సైతం ప్రయివేటు కట్టబెట్టిన బిజెపి ప్రభుత్వ పనితీరుపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాల మూలంగా సంపన్నులు మరింత సుసంపన్నులై పేదలు మరింత పేదలుగా మారుతున్నారని పేదల రాజ్యం కోసం డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే సిపిఐ 100 ఎడ్ల సందర్భంగా ఎర్రజెండా పార్టీలు ఏకమై దేశంలో ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్,  హుస్నాబాద్ సిపిఐ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్య నారాయణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కనుకుట్ల శంకర్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ
మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,
కార్యదర్శి పిల్లి రజినీ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బెక్కంటి సంపత్,ఎఐఎస్ఎఫ్
జిల్లా కార్యదర్శి
జెరిపోతుల జనార్దన్, సిపిఐ హుస్నాబాద్ మండల సహాయ కార్యదర్శి పోదిల కుమారస్వామి,
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,
కొహెడ,అక్కన్నపేట
మండలాల కార్యదర్శులు
వెల్పుల శ్రీనివాస్,
కొమ్ముల భాస్కర్,
సిపిఐ హుస్నాబాద్ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,
పిట్టల మెగిలయ్య,
పుదరి రఘుపతి,
మౌటం బాలయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య,
ఎఐవైఎఫ్ పట్టణ
కన్వీనర్ దొంతరవేని రజిత,సిపిఐ అనుబంధ సంఘం తెలంగాణ
ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post