X

ప్రజల కోసమే చాడ వెంకటరెడ్డి..

మానేటి న్యూస్ నవంబర్ 01
చిగురుమామిడి ప్రతినిధి కిరణ్ కుమార్/

కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చాడ, రేకొండ గ్రామంలో  వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన పశువుల యజమాని ఏరుకొండ రమేష్ కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడవద్దని సిపిఐ పార్టీ ఎప్పుడు అండగా ఉంటదని ఆయన అన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఆయన అన్నారు. రేకొండ గ్రామంలో బ్రిడ్జిల్లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పటి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తొక్కుడు బండల వాగు కు బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని, బ్రిడ్జి ప్రపోజ్జల్లో ఉన్న, ఇప్పుడున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రిడ్జి నిర్మించకపోవడం శోచనీయమని, ఎందరో రైతులు ప్రయాణికులు వాహనదారులు తొక్కుడుబండ్ల వాగు మీద జారిపడి కాళ్లు చేతులు విరగొట్టుకుంటున్న ,ప్రభుత్వానికి కనబడటం లేదని ప్రశ్నించారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేసి ,పంట నష్టపోయిన రైతులకు  ఎకరాన 10 వేయుల  రూపాయలు చెల్లిస్తానన్నా రేవంత్ రెడ్డి, ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని , వర్ష తాకిడికి కూలిన ఇండ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్  చాడ శ్రీధర్ రెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి వల్లభాయ్ పటేల్, మాజీ ఎంపిటిసి కొండయ్య, ముద్రగోల రాజయ్య, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు తమ్మిశెట్టి రవీందర్, విలాసాగర్ అంజయ్య, నీల వెంకన్న, బోయిని రాజు, తిపారపు వెంకటయ్య,చంచల రవి, కలవల మొగిలి, రంగయ్య,సిపిఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువకులు, తదితరులు, పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post