కమలాపూర్ మానేటి న్యూస్ – కోవరాజు సాగర్/

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రవీందర్, వైస్ చైర్మన్ దేశ్ని ఐలయ్య, మండల వ్యవసాయ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ఓబీసీ సెక్రటరీ బాలపూరి కనకారత్నం, మాజీ జెడ్పిటిసి వలిగే సాంబరావు, మాజీ ఉపసర్పంచ్ బెజ్జంకి రాజు, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రావు, తిప్పారెడ్డి యుగంధర్, యువ నాయకులు అంబి రేరాజు, అంబిరి సాంబయ్య, కరట్లపల్లి సాంబయ్య, నల్లాల శ్రీకాంత్, హమాలి సంఘం అధ్యక్షులు జమలాపురం లింగారావు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ ఝాన్సీ రవీందర్ మాట్లాడుతూ –> “రైతులు పంటలను సురక్షితంగా విక్రయించేందుకు, న్యాయమైన మద్దతు ధర లభించేందుకు ఐకేపీ సెంటర్లు ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని తెలిపారు.కార్యక్రమం చివర్లో పాల్గొన్న నాయకులు, అధికారులు రైతులతో మమేకమై సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలు ఐకేపీ సెంటర్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు.