మానేటి న్యూస్ సైదాపూర్ ప్రతినిధి వైష్ణవ్ నవంబర్ 19
ఇందిరా గాంధీ జయంతి (నవంబర్ 19) సందర్భంగా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ సంస్థలు ఆమె సేవలను స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. మాజీ ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ కి 108 వ జయంతి సందర్భంగా పాత బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ దొంత సుధాకర్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదరికం నిర్మూలన కోసం అనేక పథకాలను రూపొందించి పేద ప్రజల హృదయాల్లో చెరగలేని ముద్ర వేసుకొని ఉక్కు మహిళ అని అన్నారు. భారత దేశ ప్రధమ మహిళ ప్రధానమంత్రిగా దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయురాలు స్వర్గీయులు ఇందిరా గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిట్టయ్య, సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్,ఊసకోయిలా రాఘవులు, లంక దాసరి మల్లయ్య, బానోతు కిషన్ నాయక్, ఎర్రల శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షులు, వెల్దిరాజు, గొల్లపల్లి యాదగిరి, ప్రేమ్ కుమార్, సంపత్,తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకులు, బోనగరి అనిల్, తాళ్లపల్లి అజయ్, రఘు, రాఘన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తుది తరులు పాల్గొన్నారు.