మానేటి న్యూస్ కరీంనగర్ డిసెంబర్ 03
నల్గొండ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరిపై అగ్రవర్ణాలకు చెందిన సందీప్ రెడ్డి చేసిన అమానుష దాడిని ఖండిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.నిరసనలో ప్రసంగించిన బీసీ జేఏసీ నేతలు స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లయ్యినా అగ్రవర్ణాల ఆగడాలు తగ్గే పేర్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా యాదవ యువతి నాగలక్ష్మి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం నేపథ్యంగా ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన సందీప్ రెడ్డికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.బలహీన వర్గాలపై దాడులను అడ్డుకునేందుకు రాష్ట్రంలో బీసీ వర్గాలు ఐక్యంగా ఉద్యమం ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బీసీ జేఏసీ, ప్రజా సంఘాల పదవిదారులు ఉప్పు శ్రీనివాస్, వడ్నాల ప్రభాకర్, కామనీ సమ్మయ్య, ఆళ్ళ కేశవులు, మాడుగుల ఓదెలు, రామ్ సారన్న, మధుకర్, కందుల రవీందర్ గౌడ్, శ్రీకాంత్, టి.శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, సిహెచ్.సురేష్, కె.క్రాంతి తదితరులు పాల్గొన్నారు.