X

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత..

మానేటి న్యూస్ జగిత్యాల అక్టోబర్ 31/

భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి  ఇందిరా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్,పట్టణ అధ్యక్షులు గోపి రాజిరెడ్డి,మ్యాకల రమేష్ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పట్టణ,మండల,యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి ఇంద్ర గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1969 లో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు. నిరుపేదల కోసం రోటి.. కప్ డా…మకాన్ అనే నినాదంతో జాతీయ ఆహార భద్రత ను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. గరీబ్‌ హఠావో అను నినాదంతో ముందుకు వెళ్లారన్నారని దేశ రక్షణ కోసం అణు భద్రతను తీసుకువచ్చిన ఆమె ధీర వనిత అని అన్నారు.దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,నాయకులు తంగేళ్ల రమేష్, ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్,దాసరి గంగాధర్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,షకీర్,శ్రీకాంత్,కొమ్ముల ఆది రెడ్డి, మోబిన్,రాకేష్ నాయక్,భూమా గౌడ్,తలారి రాజేష్,మండ రమేష్, సుధాకర్ రెడ్డి, గోపాల్, రాజారెడ్డి,మసూద్, రాజేందర్,గుండేటి ఆనందం,అశోక్, శివ,రాజేష్,సంతోష్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Categories: Uncategorized
MaaNeti News Next:
Related Post