
డబుల్ బెడ్ రూమ్ కాలనీ సమస్య లను పట్టించుకొని మున్సిపల్ అధికారులు
పెండింగ్ నిర్మాణం లో ఉన్న డబల్ బెడ్ రూమ్ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి….
బి ఆర్ యస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సూద్దాల చంద్రయ్య,అయిలేని మల్లికార్జున రెడ్డి……
హుస్నాబాద్, డిసెంబర్ 2, (మానేటి న్యూస్ ):
హుస్నాబాద్ పట్టణం లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీ లబ్ధిదారుల సమస్యలను మున్సిపల్ అధికారులు వెంటనే పట్టించుకోని పరిష్కారించాలని బి ఆర్ యస్ పార్టీ కోరుతుంది కాలనీ లో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు అవడం తో కాలనీ వాసులు మురుగునీరుతో దుర్వాసనతో బాధ పడుతున్నారు. హుస్నాబాద్ పట్టణానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం లో డబుల్ బెడ్ రూమ్ కాలనీ ఉంది కాలనీ నుoడి ప్రజలు పట్టణానికి రాత్రి వేళలో వెళ్ళాలి అంటే చిమ్మని చీకటిగా ఉండడం వలన కాలనీ వాసులు భయపడుతున్నారు అదేవిధంగా కాలనీ లో పారిశుద్ధం పూర్తిగా పడకేసింది పారిశుద్ధాన్ని పట్టించుకునే పరిస్థితిలో మునిసిపల్ అధికారులు లేరు కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గా విస్మరించింది లబ్ధిదారులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనికరించే పరిస్థితి కనీసం హుస్నాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయించలేక పోతున్నారు.ఇల్లు లేని నిరుపేదలకు నీడ అందించడానికి బి ఆర్ యస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ పథకాన్ని పట్టించుకుండా రద్దు చేసింది కనీసం పెండింగ్ లో నిర్మాణం పనులను కూడా పూర్తి చేయలేకపోతుంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చివరికి లబ్ధిదారులే సొంత డబ్బులు పెట్టుకొని పెండింగ్ పనులను పూర్తి చేసుకొని డబుల్ బెడ్ రూమ్ లలో ఉండే పరిస్థితి కి వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వనికి పేద ప్రజలపై ఎంత ప్రేమ ఉందొ స్వష్టంగా కనబడుతుంది అధికారం ఉన్నదని ఇష్టారాజ్యంగా వ్యవహరించి పేద ప్రజలను పట్టించుకోకపోతే అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు తగిన తీర్పు చెప్పుతారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ యూత్ విభాగ పట్టణ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్,నాయకులు జెరిపోతుల లక్ష్మణ్ సునీత, మరియు డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.